‘అవసరం నుంచే ఆవిష్కరణ పుడుతుంది’ అంటారు. శుక్రాంత్ అనే ఢిల్లీవాలాకు మాత్రం ‘ఆరోగ్య భయం’ నుంచి ఆవిష్కరణ పుట్టుకొచ్చింది. ఢిల్లీలో కాలుష్యం ఆందోళనకరమైన స్థాయిలో ఉన్న నేపథ్యంలో శుక్రాంత్ డిఐవై (డూ ఇట్ యువర్‌సెల్ఫ్) మంత్రాన్ని జపించాడు.
తన ఆలోచనలకు పదును పెట్టి ఎయిర్ ప్యూరిఫైయర్‌ను ఇంట్లోనే తయారు చేసుకున్నాడు. దీన్ని తయారు చేయడానికి అతడికి రెండు వేల రూపాయల ఖర్చు మాత్రమే అయింది. ఇది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ని 380 నుంచి 50కి తీసుకురాగలిగింది.
తన సొంత ఎయిర్‌ప్యూరిఫైయర్ కోసం 150 ఎంఎం ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ని, అమెజాన్ నుంచి తెప్పించిన హెప ఫిల్టర్, రెగ్యులేటర్, వైర్, కార్డ్‌బోర్డ్, గ్లూ గన్‌లను ఉపయోగించాడు. రెడిట్‌లో షేర్ చేసిన శుక్రాంత్ ΄ోస్ట్ వైరల్‌గా మారింది. ‘ఎయిర్ ప్యూరిఫైయర్‌ని తయారు చేయడమనేది రాకెట్ సైన్స్ కాదు.
సింపుల్‌గా చెప్పాలంటే ఫిల్టర్స్ ద్వారా గాలి ప్రవాహాన్ని లోపలికి, బయటికి పంపించే సరళమైన పరికరాన్ని తయారు చేయడం’ అన్నారు ఒక నెటిజన్.శుక్రాంత్ పోస్ట్ చూసిన తరువాత ‘మేము సైతం’ అంటూ కొందరు ఎయిర్ ప్యూరిఫైయర్‌లను తయారుచేసే పనిలో పడ్డారు.
(చదవండి: Can Diabetics Eat Sweet Potato: చక్కెర బాధితులు తినదగ్గ దుంప... చిలగడదుంప!)


