సూపర్‌ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్‌ మీరెపుడైనా చూశారా? | Cute Girl Dancing Video Goes Viral | Sakshi
Sakshi News home page

సూపర్‌ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్‌ మీరెపుడైనా చూశారా?

May 6 2024 4:43 PM | Updated on May 6 2024 5:34 PM

Cute Girl Dancing Video Goes Viral

చిన్న పిల్లల చేష్టలు భలే ముద్దుగా ఉంటాయ్‌. అందులోనూ  అమ్మాయిలు చేస్తే ఇంకా ముచ్చటగా ఉంటుంది.  అమ్మచీర దొంగచాటుగా   చుట్టేసు కోవడం, పెద్ద జడకోసం  ఆరాట పడటం . అబ్బో..ఈ లిస్ట్‌ చాలా పెద్దదే. ఇది మాత్రమే కాదు.. అమ్మ చేసే పనులను కాపీ చేస్తూ ఉంటారు.  పెద్ద ఆరిందాలాగా చీపురు పట్టకొని ఊడ్వడం, బుజ్జి బుజ్జి చేతులతో వంట చేసేయడం, వడ్డించడం లాంటి పనులు చేసి మురిపిస్తుంటారు.  

ఇక ఒక టీవీ చూస్తూ  డాన్స్‌లు వేయడం,అద్దం ముందు నించొని  చేసే చేష్టల గురించైతే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేలేదు. తాజాగా ఓ చిన్నారి  డ్యాన్స్‌ వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

 

ఒక షాపింగ్‌ మాల్‌లో ఒక చిన్నారి  ఒక రేంజ్‌లో  డ్యాన్స్‌ చేసింది.  ఎక్కడ  ఎవరు తీసారు అనే వివరాలు అందుబాటులో లేనప్పటికీ, షాపింగ్‌ మాల్‌  ట్రయిల్‌ రూంలో అద్దం ముందు నిల్చొని అద్భుతంగా స్టెప్పులేసింది. దీంతో అద్దాల్లో  నలుగురు చిన్నారులు గ్రూపు డ్యాన్స్‌ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ అమ్మాయి అభియం కూడా నిజంగా అక్కడ నలుగురు అమ్మాయిలున్నారా అనిపించేలా చేసింది. దీంతో నెటిజన్లు వావ్‌..సూపర్‌ అంటున్నారు. మరి  మీరు కూడా  ఒకసారి  చూసేయ్యండి ఆ వీడియోను. 
   
 

Advertisement
 
Advertisement
Advertisement