Is Curd Safe in Monsoon Season?, Nutritionist Reveals Myths and Facts - Sakshi
Sakshi News home page

Is Curd Safe In Rainy Season: వర్షాకాలంలో పెరుగు తింటున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే

Jul 21 2023 3:51 PM | Updated on Jul 27 2023 4:46 PM

Is Curd Safe In Monsoon Season Nutritionist Reveals Myths And Facts - Sakshi

వర్షాకాలంలో అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం ఎంతో ముఖ్యం.ఈ క్రమంలో వర్షాకాలంలో చాలామంది తమ డైట్‌ను కూడా మార్చుకుంటుంటారు. ఇక ప్రతిరోజు మనం తినే పాలు, పెరుగు, మజ్జిగ,నెయ్యి వంటివి ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ వాటిని ఎప్పుడు పడితే అప్పుడు తినడం మంచిది కాదంటున్నారు నిపుణులు.

ముఖ్యంగా ఈ వర్షాకాలంలో పెరుగు వినియోగానికి కాస్త దూరంగా ఉండాలంటున్నారు. దీనికి కారణం ఏంటి? వర్షకాలంలో పెరుగు తినడం మంచిదా? కాదా? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం..


వర్షాకాలంలో ఆరోగ్యంపై జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. లేదంటే ఈ సీజన్‌లో జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే కొన్ని పదార్థాలకు దూరంగా ఉండటమే మంచిదంటున్నారు నిపుణులు. ఆ లిస్ట్‌లో పెరుగు కూడా ఉంది. చాలామందికి భోజనం చివర్లో పెరుగు లేకపోతే ఏదో వెలితిగా ఫీల్‌ అవుతుంటారు.

అయితే ఈ సీజన్‌లో పెరుగు తినడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. వర్షకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెరుగు తినడం వల్ల కఫం ఏర్పడుతుంది. దీని వల్ల గొంతు నొప్పి, కీళ్ల నొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. అందుకే ఈ సీజన్‌లో ఒకవేళ పెరుగు తినాలనుకున్నా మధ్యాహ్న భోజనంలో తింటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

పెరుగులోని ప్రోబయాటిక్స్‌ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. కానీ పెరుగు తినాలనుకుంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా క్వాంటిటీని తగ్గించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జలుబు, అలెర్జీ ఉన్నవారు వర్షాకాలంలో పెరుగు తినకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement