
తీవ్రమైన కుంగుబాటు (డిప్రెషన్), ఉద్విగ్నతకు (యాంగ్జైటీ) లోను కావడం వంటివి పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయని డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాలు పేర్కొంటున్నాయి.
ఉదాహరణకు 2021 నాటి డబ్ల్యూహెచ్‌ఓ లెక్కల ప్రకారం మానసిక సమస్యలతో బాధపడేవారిలో పురుషుల సంఖ్య 13 శాతం కాగా... మహిళల్లో ఆ సంఖ్య 14.8 శాతం. అదే నివేదికలోని వివరాల ప్రకారం... యాంగై్జటీ సమస్యలు వయసుపరంగా చూస్తే బాలికల్లో చాలా త్వరగా బయటపడతాయనేది డబ్ల్యూహెచ్‌ఓ రిపోర్టులు చెబుతున్న మాట. ఉదాహరణకు యాంగ్జైటీ సమస్యలతో బాధపడేవారిలో 10 నుంచి 19 ఏళ్ల వయసున్న బాలికలు 5.8 శాతం మంది ఉండగా... 20 నుంచి 24 ఏళ్ల వయసున్న యువతులు 7.1 శాతం మంది ఉంటారు. ఇక యాంగై్జటీ బాధితుల్లోనే యుక్తవయసుకు వచ్చిన ఆడపిల్లలు 5.7 శాతం మంది ఉంటారు. అలాగే 50 నుంచి 69 ఏళ్ల మహిళల విషయానికి వస్తే ఇందులో డిప్రెషన్‌తో బాధపడేవారు 6 నుంచి 7 శాతం వరకు ఉంటారని డబ్ల్యూహెచ్‌ఓ నివేదికలు వెల్లడిస్తున్నాయి.
చదవండి: నో ఫుడ్.. నోవాటర్.. రోజుకి 8 లీటర్ల ఇంజిన్ ఆయిల్ చాలు, వైరల్ వీడియో