
కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి సాధారణ ఆహారాన్ని తీసుకోకుండానే గత 33 ఏళ్లుగా జీవిస్తున్నాడట. అదేంటి? ఎలా? అని ఆశ్చర్య పోతున్నారా? మరదే కదా స్టోరీ.. రోజుకు కేవలం 7-8 లీటర్ల వేస్ట్ ఇంజిన్ ఆయిల్, టీ మాత్రమే సేవిస్తాడు. అందుకే లోకల్‌గా ‘ఆయిల్ కుమార్’గా పాపులర్ అయ్యాడట. దీనికి సంబంధించి ఒక వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ వైరల్ వీడియోలో రైస్ , చపాతీలు ఇస్తే తీసుకోలేదు. దీనికి బదులుగా ఇంజిన్ ఆయిల్ బాటిల్‌ను ఎత్తి గటా గటా తాగేశాడు. కర్ణాటకలో సాధువు రూపంలో నివసిస్తున్న ఆయిల్ కుమార్ మోటార్ ఆయిల్ తాగుతూ సంతోషంగా జీవిస్తున్నాడు. గత కొన్ని దశాబ్దాలుగా రోజువారీ 7-8 లీటర్ల వేస్ట్ ఇంజిన్ ఆయిల్ తాగుతూ జీవిస్తున్నాడు. అంతేకాదు ఇప్పటివరకు అతనికి ఎలాంటి అనారోగ్యం రాలేదనీ, ఆసుపత్రికి వెళ్లలేదనీ,ఆరోగ్యకరమైన జీవిస్తున్నానని తెలిపాడు పైగా అయ్యప్ప ఆశీస్సుల వల్లే ఈ ప్రత్యేక జీవనశైలి సాధ్యమవుతుందని అయ్యప్ప వేషధారణలోఉన్న ఆయిల్ కుమార్ చెప్పుకొచ్చాడు.తన విశ్వాసమే దీన్ని భరించే సామర్థ్యాన్ని ఇస్తోందనీ, ఆ అయ్యప్ప స్వామి దయ ద్వారా మాత్రమే తాను జీవిస్తున్నాననేది అతని విశ్వాసం.
నిపుణులేమంటున్నారంటే
అయితే, వైద్య నిపుణులు మాత్రం దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. మోటారు ఆయిల్‌లో మానవులకు విషపూరితమైన పెట్రోలియం ఆధారిత సమ్మేళనాలు ఉంటాయని, చాలా ప్రమాదమ నొక్కి చెప్పారు. ఇలాంటి పదార్థాలను మింగడం లేదా పీల్చడం వల్ల అనేక తీవ్రమైన పరిణామాలు సంభవించవచ్చు. ముఖ్యంగా ఊపిరితిత్తులలోకి పీల్చినట్లయితే, తక్షణ , దీర్ఘకాలిక ప్రమాదాలు ఎదురవుతాయని వారు హెచ్చరించారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్,శ్వాసకోశ వైఫల్యం, దీర్ఘకాలిక దగ్గు, శ్వాసలోపం మరియు శ్వాస ఆడకపోవడం ప్రాణాంతక పరిస్థితులకు దారితీయవచ్చుని పేర్కొన్నారు. జీర్ణవ్యవస్థ ప్రభావం చూపుతుంది.నోరు, గొంతు , కడుపులో కాలిపోవచ్చు.అంతర్గత రక్తస్రావం. వాంతులు, కొన్నిసార్లు రక్తపు వాంతులు కావచ్చు. అల్సర్లు, పుండ్లు తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారి తీయవచ్చు. తలనొప్పి, తలతిరగడం, దిక్కుతోచని స్థితి, మూర్ఛ వంటి నాడీ సంబంధిత సమస్యలొస్తాయి. ఈ విషపూరిత సమ్మేళనాలతో కాలేయం,మూత్రపిండాలకు దెబ్బతినేఅవకాశం ఉంది. హైడ్రోకార్బన్ కంటెంట్ కారణంగా గుండెజబ్బు లాంటి ప్రాణాంతక సమస్యలు రావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.