బాదంతో.. కంటి చూపు భేష్‌! | Almonds Improve Eyesight And Health | Sakshi
Sakshi News home page

బాదంతో.. కంటి చూపు భేష్‌!

Jun 20 2026 9:08 AM | Updated on Jun 20 2026 9:08 AM

Almonds Improve Eyesight And Health

బాదం పప్పు ఆకారం చూస్తే అచ్చం కన్నులాగే ఉంటుంది. అందువల్ల దీనిని కనుదృష్టి కోసం వాడతారు. బాదం పప్పులు 200 గ్రాములు తీసుకొని రాత్రి వేడి నీటిలో నానబెట్టాలి.

తెల్లవారిన తరువాత పై తోలు తీసి నలగ్గొట్టి చూర్ణం చేసుకొని ఎండబెట్టి పొడి చేసుకోవాలి.అదే విధంగా సోంపు గింజలు 200 గ్రాములు తీసుకొని దోరగా వేయించి దంచి పొడి చేసుకొని దానికి మెత్తగా పొడి చేసిన 200 గ్రాముల కండ చక్కెర  కలుపుకొని ఒక గాజు పాత్రలో నిల్వ చేసుకోవాలి.

పెద్దలకు రెండు స్పూన్‌లు మోతాదుగా ఆవుపాలు వేడి చేసుకొని అందులో ఈ చూర్ణం కలుపుకొని సేవిస్తుంటే నేత్ర దృష్టి పెరుగుతుంది. పిల్లలకయితే ఒక స్పూన్‌ చాలు. ఈ విధంగా ఒక సంవత్సరం వాడితే కంటిచూపు బాగుండటమే గాక జ్ఞాపక శక్తి పెరుగుతంది. కృశించి ΄ోయిన శరీర భాగాలు కూడా ఉత్తేజం చెందుతాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement