జస్ట్‌ 24 వారాల్లో 25 కిలోలు బరువు ..! నిలకడగా ఆ మూడు అలవాట్లు.. | 46 year old fitness coach lost 25 kg in 24 weeks without crash diets | Sakshi
Sakshi News home page

జస్ట్‌ 24 వారాల్లో 25 కిలోలు బరువు ..! నిలకడగా ఆ మూడు అలవాట్లు..

Jun 28 2026 3:05 PM | Updated on Jun 29 2026 9:35 AM

46 year old fitness coach lost 25 kg in 24 weeks without crash diets

బరువు తగ్గడానికి ఎల్లప్పుడూ కఠినమైన ఆహార నియమాలు లేదా తీవ్రమైన వ్యాయామాలు అవసరం లేదని కొందరు ఫిట్‌నెస్‌ ఔత్సాహికులు నిరూపిస్తున్నారు. కేవలం నిలకడతో జీవనశైలి మార్పులను అనుసరిస్తే చాలంటున్నారు. తాజాగా మరో ఫిట్‌నెస్‌ నిపుణుడు అలా చేసే జస్ట్‌ ఆరు నెలల్లో 25 కిలోలు పైనే తగ్గి చూపించాడు. తన శరీరాకృతిని స్లిమ్‌గా మార్చుకోవడానికి సహాయపడిన ఆచరణాత్మక నియామాలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. అవేంటంటే..

ఫిట్‌నెస్‌ నిపుణుడు జీషన్‌అలీ తాను సులభమైన జీవనశైలి మార్పులతోనే 25 కిలోలు పైనే తగ్గానని అన్నారు. కడుపు నిండినట్లు అనిపించకపోవడమే అధికంగా తినాలనే కోరికలను రేకెత్తిస్తుందని అన్నారు. ఫలితంగా జింక్‌ ఫుడ్‌పైకి మనసు మళ్లుతుందని అన్నారు. అందుకోసం తాను జస్ట్‌ మూడు నియమాలను పాటించానని అన్నారు.

నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి..నీరు తాగండి..
నిద్ర నీరు రహస్య ఆయుధాలని నొక్కి చెబుతున్నాడు. తాను ప్రతి రాత్రి 10:30 గంటలకల్లా పడుకునేవాడినని, రోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగేవాడినని అన్నారు. ఇక్కడ ఎక్కువ నిద్ర, ఎక్కువ నీరు అంటే.. ఎక్కువ శక్తి, తక్కువ ఆకలి అని చెప్పారు. 

ప్రతిరోజు ఒక దినచర్యను పాటించడం..
అంటే నిద్ర, జిమ్‌, వాకింగ్‌లకు సమాన ప్రాధాన్యతి ఇస్తూ చేయాలి. ముందుగా ప్లాన్‌ చేసుకుని అనుసరిస్తే..సవ్యంగా ఉంటుంది లేదంటే ఆ ప్లాన్‌ కాగితానికే పరిమితం అవుతుందని అంటున్నారు.

తగినంత ప్రోటీన్ తీసుకోండి..
అతని బరువు తగ్గే ప్రయాణంలో ఆకలిని నియంత్రించడంలో ప్రోటీన్‌ కీలకపాత్ర పోషిస్తుందని అంటున్నారు. తాను తక్కువ ఆహారం తీసుకున్నప్పటికీ..ప్రోటీన్‌ మాత్రం రోజుకి 180–200 గ్రాములకు పరిమితం చేశానని అన్నారు. 

కండరాలను కాపాడుకోవడానికి, ఆకలి కోరికలు తగ్గించుకోవడానికి, అలాగే జీవక్రియను మెరుగ్గా ఉంచడానికి ఇది ఉపకరిస్తుందని అన్నారు. దీనివల్ల పొట్టకొవ్వు వేగంగా తగ్గుతుందని చెబుతున్నారు. అలా 46 ఏళ్ల వయసులో 24 వారాల్లో తాను 101 కేజీల నుంచి 76 కేజీలకు తగ్గానని చెప్పారు. 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: 'టైప్‌రైటర్‌'తో అద్భుతమైన చిత్రం..! ఆ క్రియేటివిటీకి మాటల్లేవ్‌ అంతే)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement