కుంచె పట్టుకుని చిత్రాలు గీసి ఉండటం చూశాం. పోనీ రంగులతో, చేతితో,కాలితో.. వాటన్నింటిని కాలదన్నేలా నోటితో కూడా చిత్రాలు వేయడం చూశాడు. టైపింగ్ మిషన్ సాయంతో చిత్రాలు గీయడం గురించి విన్నారా? ఔను అది కూడా టైప్ చేస్తూ కళాకృతి అంటే..మాటలకందనిది..సాధ్యమా? అని ఆశ్చర్యం రేకెత్తించే అంశం. కానీ ఈ వ్యక్తి ఎంత అద్భుతంగా టైప్‌రైటర్‌తో చిత్రం గీశాడో చూస్తే షాకవ్వుతారు.
కళాకారుడు జేమ్స్ కుక్ పూర్తిగా టైప్‌రైటర్ సాయంతో గీసిన చిత్రాన్ని పంచుకున్నాడు. అది కూడా 2026 వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌లకు ఒక అసాధారణమైన నివాళిగా ఇలా చిత్రించడం విశేషం. అతను మొత్తం కళాకృతిని పూర్తి టైప్‌రైటర్‌తో సృష్టించాడు. ప్రతి కీస్ట్రోక్‌తో ప్రతి వివరాలను జాగ్రత్తగా రూపొందించాడు. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేశాడు.
ఆ వీడియోలో జేమ్స్ కుక్ తన టైప్‌రైటర్ వద్ద కూర్చుని..ఒక ఖాళీ కాగితాన్ని ఉంచడం నుంచి మొదలయ్యి.. కీలను నొక్కిన ప్రతిసారీ, స్టేడియం వంటి వాటితో జీవం పోసుకుంటుంది. కెమెరా జూమ్ చేయగా, స్టేడియంతో కళకళలాడుతున్న ప్రేక్షకుల నుంచి ఐకానిక్ గ్రీన్ టెన్నిస్ కోర్ట్ వరకు, ప్రతి క్లిష్టమైన వివరాలు స్పష్టమవుతాయి. ఆ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణలలో ఒకటి స్కోర్‌బోర్డ్. దానిపై "రోజర్ ఫెదరర్", "ఎన్. జొకోవిచ్" అని రాసి ఉండటం.
ఈ వింబుల్డన్ చిత్రం ఇద్దరు గొప్ప ఛాంపియన్‌లను నివాళులర్పిస్తుంది. ఇది కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు..వందలాది ప్రత్యేకమైన టైప్ చేసిన ఫ్రేమ్‌లను సృష్టించి, వాటిన్నింటిని కలిపి ప్లే చేస్తే.. కదులుతున్నాయనే భ్రమను కలిగించే యానిమేషన్ చిత్రం ఇది. ఆ చిత్రంలో ఆటగాళ్లు కోర్టు అంతటా ర్యాలీ చేస్తున్నట్టుగా కనిపిస్తారు. ఈ ఆ కళాకృతిని పూర్తిగా టైప్‌రైటర్‌తో రూపొందించినా..చివరల్లో మంత్రముగ్ధులను చేసే యానిమేషన్ మారుతుంది.
అంతేగాదు ఆ వీడియోకి నేను నా టైప్‌రైటర్‌తో చిత్రాలు గీస్తాను. 2026 వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌లను పురస్కరించుకుని నేను రూపొందించిన కళాకృతి ఇదిగో అని క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశాడు జేమ్స్. అలాగే పోస్ట్‌లో.. "ఒక అభిమానిగా కళను, యానిమేషన్‌ను మిళితం చేసేలా యానిమేషన్ చిత్రాన్ని సృష్టించాలనుకున్నా. అందుకు వందలాది ఫ్రేమ్‌లను ఒక్కోక్కటిగా చేతితో టైప్ చేసి, ఫ్రేమ్ ఫ్రేమ్‌గా ఈ కళాకృతికి జీవం పోశాను.
ఇది ఇప్పటివరకు నేను చేసిన ప్రాజెక్టులలో అత్యంత క్లిష్టమైనది. పైగా ఈ చిత్రంలో టైప్‌చేసిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించా అని రాసుకొచ్చాడు". జేమ్స్ పోస్ట్‌లో. ఈ చిత్రం వెనుకున్న అపారమైన సహనం, క్రియేటివిటీకి మత్రముగ్ధులవుతూ పోస్టులు పెట్టారు.
(చదవండి: మనవడి కోసం.. బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా 75 ఏళ్ల వృద్ధుడు!)


