జల విలయానికి ఇదే సాక్ష్యం | - | Sakshi
Sakshi News home page

జల విలయానికి ఇదే సాక్ష్యం

Nov 7 2026 1:00 AM | Updated on Nov 7 2026 1:00 AM

రోజుల తరబడి నీటిలో నానుతున్న వరి పంట

ఉంగుటూరు: ఇటీవల సంభవించిన వరుస తుపాన్ల ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు మండల పరిధిలోని బొమ్మిడి, కాగుపాడు, బాదంపూడి, ఉంగుటూరు, కై కరం గ్రామాల్లో వేలాది ఎకరాల్లో వరి పంట తీవ్రంగా దెబ్బతిందది. కై కరం హైవే రోడ్డును ఆనుకొని ఉన్న సుమారు 100 ఎకరాలు, తూర్పు పక్కన ఉన్న మరో 150 ఎకరాల వ్యవసాయ భూములు ప్రతి సంవత్సరం వర్షాలకు ముంపునకు గురవుతున్నాయి. అలాగే కై కరం కొత్తూరు, కొత్త దళితపేట, పాత దళితపేట ప్రాంతాల్లోని ప్రజలు అకాల వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేబ్రోలు – కై కరం మధ్య ఉన్న అక్కిలేరు బ్రిడ్జి వద్ద గుర్రాల వాగుకు వెళ్లాల్సిన డ్రెయినేజీ కాలువలు ఆక్రమణలకు గురికావడం వల్ల వరద నీరు ముందుకు సాగక ఈ పరిస్థితి దాపురించిందని రైతులు వాపోతున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం ఏలూరు జిల్లా కన్వీనర్‌ కొర్ని అప్పారావు, ఉంగుటూరు మండల కార్యదర్శి కేశవరావు తదితరులు ముంపునకు గురైన పంటను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రైతులు మేడికొండ రమేష్‌, పప్పల నరసయ్య, కొల్లపరెడ్డి సహదేవుడు, సుంకర శివ, పొడుగు రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement