పోలవరం నిర్వాసితుల ఎన్నికల బహిష్కరణ | - | Sakshi
Sakshi News home page

పోలవరం నిర్వాసితుల ఎన్నికల బహిష్కరణ

Nov 7 2026 1:12 AM | Updated on Nov 7 2026 1:12 AM

బుట్టాయగూడెం: ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయాలని కోరుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు శుక్రవారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించారు. మూడేళ్లుగా ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయాలని అధికారుల దృష్టికి తీ సుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో ఎన్నికలను బహిష్కరించినట్టు నిర్వాసితులు తెలిపారు. బు ట్టాయగూడెం మండలంలోని తల్లవరం, తూటికుంట, ములగలపల్లి, పైడాకులమామిడి, పల్లపూరు గ్రామాలతో పాటు జీలుగుమిల్లి మండలంలోని కొరుటూరు, గాజులగొంది, టేకూరు గ్రామాలకు చెందిన నిర్వాసితులు ఐదేళ్ల క్రితం పోలవరం మండలం నుంచి జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాలకు పునరావాస కాలనీలకు తరలివచ్చారు. అప్పటి నుంచి ఆయా గ్రామాల వారు తమకు ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయాలని అధికారులకు వేడుకుంటున్నా పట్టించుకోలేదు. దీంతో తాము పరిషత్‌ ఎన్నికలను బహిష్కరించామని, ఇప్పటికీ స్పందన రాకపోతే సర్పంచ్‌ ఎన్నికలు సైతం బహిష్కరిస్తామని నిర్వాసితులు సాయిప్రసాద్‌, అరగంటి చిన్నారెడ్డి, చింతల రామిరెడ్డి, కోళ్ల మంగరెడ్డిలు తెలిపారు. కాగా, తమ గ్రామాల్లో 5 వేల మంది జనాభా, 1,150 మంది ఓటర్లు ఉన్నారన్నారు. అలాగే జీలుగుమిల్లి మండలంలో కొరుటూరు, గాజులగొంది, టేకూరు పరిధిలో 773 మంది ఓటర్లు ఉన్నారని, రెండు మండలాల్లో ఉన్న నిర్వాసితులకు ఎవరికి వారికి ప్ర త్యేక పంచాయతీ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement