అనధికార దుకాణాలపై చర్యలు | - | Sakshi
Sakshi News home page

అనధికార దుకాణాలపై చర్యలు

Nov 7 2026 1:12 AM | Updated on Nov 7 2026 1:12 AM

ఏలూరు (టూటౌన్‌): జిల్లాలో అనధికార బాణాసంచా దుకాణలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. బాణసంచా విక్రయదారుల అనుమతులు, భద్రతా నిబంధనలు, తదితర అంశాలపై జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్‌తో శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. దుకాణదారులు, నిల్వదారులు తప్పనిసరిగా లైసెన్సులు పొందాలని, అనధికార విక్రయ, నిల్వ దారులపై కేసులు నమోదు చేయాలన్నారు. దుకాణాల దగ్గర అగ్నిప్రమాద నిరోధక వస్తువులు ఇసుక, నీరు, వంటివి తప్పనిసరిగా ఉండేలా చూ డాలన్నారు. ప్రతి దుకాణాదారు లైసెన్స్‌ను తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. బాణాసంచా అనధికార నిల్వలపై తహసీల్దార్‌, ఎంపీడీఓ, పోలీసు అధికారులు వారి పరిధిలో ఉమ్మడి తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రతిఒక్కరూ ప్రమాదరహిత దీపావళిని జరుపుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ శివకిషోర్‌ మాట్లాడుతూ బాణసంచా దుకాణాల వద్ద లైసెన్సులు పరిశీలించాలని, గ్రామంలో బాణాసంచా అక్రమ నిల్వ, విక్రయదారులు నియంత్రించాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా పెట్టాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎంజే అభిషేక్‌ గౌడ, నూజివీడు సబ్‌ కలెక్టర్‌ బి.వినూత్న, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సీహెచ్‌ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, ఆర్డీఓలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement