ఏసీబీ వలలో కాలుష్య నియంత్రణ అధికారి | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో కాలుష్య నియంత్రణ అధికారి

Nov 7 2026 1:12 AM | Updated on Nov 7 2026 1:12 AM

ఏసీబీ వలలో కాలుష్య నియంత్రణ అధికారి

ఏలూరు టౌన్‌: పొ ల్యూషన్‌ కంట్రోల్‌ బో ర్డు అవినీతి కాలుష్యం బారినపడింది. ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీర్‌ అధికారి లంచావతారం ఎత్తారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అవినీతి నిరోధకశాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏలూరు రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ జీవీ కృష్ణారావు ఆధ్వర్యంలో జిల్లా పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు రీజనల్‌ కార్యాలయంలో ట్రాప్‌ వేసి ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీర్‌ అందే సీతారామచంద్రమూర్తిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు నవాబ్‌పేటకు చెందిన మత్తే బాబీ ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం గ్రామంలో వేర్‌హౌస్‌ నిర్మాణానికి పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీర్‌ సీతారామచంద్రమూర్తిని సంప్రదించగా నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌కు రూ.లక్ష డిమాండ్‌ చేశారు. తాను అంత ఇచ్చుకోలేని రూ.30 వేలు ఇస్తానని బాబీ చెప్పాడు. అనంతరం బాబీ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ కృష్ణారావు ఆధ్వర్యంలో అధికారులు ట్రాప్‌ వేశారు. పొ ల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు కార్యాలయంలో శుక్రవా రం సాయంత్రం రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా సీతారామచంద్రమూ ర్తిని పట్టుకున్నారు. అధికారులు లంచం డిమాండ్‌ చేస్తే చర్యలు తప్పవని, ఎవరైనా సొమ్ములు డిమాండ్‌ చేస్తే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని డీఎస్పీ కృష్ణారావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement