21న చినవెంకన్న తెప్పోత్సవం | - | Sakshi
Sakshi News home page

21న చినవెంకన్న తెప్పోత్సవం

Nov 7 2026 1:18 AM | Updated on Nov 7 2026 1:18 AM

21న చినవెంకన్న తెప్పోత్సవం ఏకలవ్య పాఠశాలల తనిఖీ 15 వరకు దూరవిద్య ప్రవేశాలు వర్జీనియా రైతులను ఆదుకుంటాం 10న మల్లఖంబ్‌ సెలెక్షన్స్‌ 8న రైఫిల్‌ షూటింగ్‌ సెలెక్షన్స్‌

ద్వారకాతిరుమల: క్షీరాబ్ధి ద్వాదశిని పురస్కరించుకుని ఈనెల 21న రాత్రి చినవెంకన్న తెప్పోత్సవానికి అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. శ్రీవారి పుష్కరణి (నృసింహ సాగరం)ని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు శుక్రవారం పుష్కరణిలో తెప్పకు మరమ్మతులు చేపట్టారు. గట్లపై పేరుకుపోయిన ముళ్లపొదలు, పిచ్చిమొక్కలను తొలగిస్తూ పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. వారం రోజుల్లో విద్యుద్దీపాలంకరణ పనులు ప్రారంభించనున్నారు. అదే రోజు రా త్రి 8 గంటలకు తెప్పోత్సవం ప్రారంభమవుతుందని ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు.

బుట్టాయగూడెం: రాష్ట్రంలోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆటల పోటీల్లో నైపుణ్యం పెంపొందించేలా చర్యలు తీసుకున్నట్టు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ గురుకులం కార్యదర్శి ఎం.గౌతమి తెలిపారు. శుక్రవారం జీలుగుమిల్లి, బుట్టాయగూడెంలోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడుతూ రాష్ట్రంలోని 28 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల విద్యార్థులకు క్రీడల్లో ప్రోత్సాహం అందించేందుకు త్వరలోనే ప్రత్యేకంగా స్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహించనున్నట్టు చెప్పారు. నాణ్యమైన విద్యాబోధన, నిబంధనల ప్రకారం మోనా అందించాలన్నారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో టెన్త్‌, ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగించినట్టు డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ తె లిపారు. ఈనెల 15 వరకు గడువు పొడిగించారని, ఆ తర్వాత 31లోపు రూ.300 అపరాధ రు సుంతో ప్రవేశాలు పొందవచ్చన్నారు. అ భ్యర్థులు ఏపీ ఓపెన్‌ స్కూల్‌ వెబ్‌సైట్‌ లేదా త మ సమీపంలోని అధీకృత స్టడీ సెంటర్ల ద్వారా ప్రవేశాలు పొందవచ్చన్నారు.

కొయ్యలగూడెం: మురసు తుపానుతో దెబ్బతిన్న వర్జీనియా పొగాకు తోటలను బోర్డు చైర్మన్‌ చిడిపోతు యశ్వంత్‌ కుమార్‌ శుక్రవారం పరిశీలించారు. నష్టపోయిన రైతులను బోర్డు ద్వారా ఆదుకుంటామన్నారు. దెబ్బతిన్న పొగాకు నారుమడులు, పొగాకు పంట, తడిసిన పొగాకు బేళ్లు, బ్యారన్‌లను పరిశీలించారు. కొయ్యలగూడెం, కన్నాపురం, దిప్పకాయలపాడు, అచ్చయ్యపాలెం, కండ్రికగూడెం గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. వేలం నిర్వహణ అధికారి శివకుమార్‌, వర్జీనియా రైతు సంఘం అధ్యక్షుడు కాకర్ల నంది తదితరులు పాల్గొన్నారు.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): హైదరాబాద్‌లో జరిగే 7వ ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌–2026 జాతీయ క్రీడా పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు అండర్‌–18 రాష్ట్ర క్రీడాకారుల ఎంపికలను ఈ నెల 10న నిర్వహించనున్నామని శాప్‌ ప్రతినిధులు ప్రకటనలో తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఎస్‌సీహెచ్‌ఆర్‌ఎం హై స్కూల్‌ ఆవరణలో బాలబాలికలకు మల్లఖంబ్‌ సెలెక్షన్స్‌ నిర్వహిస్తామన్నారు. ఉదయం 9 గంటల నుంచి సెలెక్షన్స్‌ ప్రారంభమవుతాయని, 01.01.2009 తేదీ తర్వాత జన్మించిన క్రీడాకారులు మాత్రమే అర్హులన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌ 99082 67811లో సంప్రదించాలని ఆయన కోరారు.

వీరవాసరం: అర్నబ్‌ తుపాను కారణంగా వా యిదా పడిన స్కూల్‌గేమ్స్‌ అండర్‌–14, 17 బాలబాలికల రైఫిల్‌ షూటింగ్‌ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జట్ల ఎంపికలు ఈనెల 8న భీమవరంలోని చింతలపాటి బాపిరాజు మున్సిపల్‌ హైస్కూల్‌లో నిర్వహించనున్నట్టు జిల్లా స్కూల్‌గేమ్స్‌ కార్యదర్శులు గుత్తుల నర్మద, మహమ్మద్‌ ఖుద్ధుస్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement