పరిషత్‌ తీర్పు నేడే | - | Sakshi
Sakshi News home page

పరిషత్‌ తీర్పు నేడే

Nov 7 2026 1:18 AM | Updated on Nov 7 2026 1:18 AM

కౌంటింగ్‌ కేంద్రాలు ఇలా..

● ఏలూరు సీఆర్‌ రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాల: ద్వారకాతిరుమల, ఉంగుటూరు, ఏలూరు రూరల్‌, కై కలూరు, ముదినేపల్లి, భీమడోలు, పెదవేగి మండలాలు

● ఏలూరు సీఆర్‌ రెడ్డి పాలిటెక్నిక్‌ కళాశాల: పెదపాడు, నిడమర్రు, కలిదిండి, దెందులూరు, మండవల్లి, కామవరపుకోట మండలాలు

● జంగారెడ్డిగూడెం నోవా ఇంజనీరింగ్‌ కళాశాల: కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, టి.నరసాపురం, జీలుగుమిల్లి, పోలవరం, బుట్టాయగూడెం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు

● నూజివీడు సారథి ఇంజనీరింగ్‌ కళాశాల: ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు, నూజివీడు, చింతలపూడి, లింగపాలెం మండలాలు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాలోని మూడు డివిజన్లలో పరిషత్‌ కౌంటింగ్‌ ప్రక్రియ శనివారం జరగనుంది. జిల్లాలోని 26 జెడ్పీటీసీ, 441 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. శనివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభించి విజేతలను ప్రకటించనున్నారు. ఏలూరులోని సీఆర్‌ రెడ్డి ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏలూరు డివిజన్‌, నూజివీడులోని సారథి ఇంజనీరింగ్‌ కళాశాలలో నూజివీడు డివిజన్‌, జంగారెడ్డిగూడెం నోవా ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆ డివిజన్‌కు సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించనున్నారు.

8.77 లక్షల ఓట్లు లెక్కింపు

జిల్లాలో 26 జెడ్పీటీసీలు, 441 ఎంపీటీసీ స్థానాలకు గురు, శుక్రవారాల్లో పోలింగ్‌ ప్రక్రియ నిర్వహించారు. గురువారం జిల్లాలోని 23 జెడ్పీటీసీలు, 401 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 11.62 లక్షలు మంది ఓటర్లకు గాను, 8,77,915 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వేలేరుపాడు, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, పోలవరం నాలు గు జెడ్పీటీసీ స్థానాలు, 40 ఎంపీటీసీ స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో కౌంటింగ్‌ ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్‌ వెట్రిసెల్వి, అధికార యంత్రాంగం పరిశీలించారు.శనివారం ఉదయం 7.30 గంటలకు మూడు డివిజన్‌లలో స్ట్రాంగ్‌రూమ్‌లను పార్టీ ఏజెంట్ల సమక్షంలో తెరిచి 8 గంటల నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లను వేర్వేరుగా లెక్కించనున్నారు.

ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెంలో ఏర్పాట్లు

441 ఎంపీటీసీ, 26 జెడ్పీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు

ఉదయం 8 నుంచి కౌంటింగ్‌ ప్రారంభం

ఇప్పటికే 13 ఎంపీటీసీ, 1 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement