పండుగకు సొంతూళ్లకు వెళ్తుండగా ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

పండుగకు సొంతూళ్లకు వెళ్తుండగా ప్రమాదం

Oct 18 2026 1:36 AM | Updated on Oct 18 2026 1:36 AM

పాత నేరస్తుల బైండోవర్‌

● ఇద్దరు పోలవరం ప్రాజెక్ట్‌ కార్మికులు దుర్మరణం

● తెలంగాణలో ఘటన

పోలవరం రూరల్‌/వైరా: పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రానికి వలస వెళ్లి పనిచేస్తున్న ఆ కార్మికుల ఆశలు దసరా పండుగ వేళ అడియాసలయ్యాయి. కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకోవాలని స్వగ్రామానికి బయలుదేరిన వారు.. గమ్యం చేరకుండానే కానరాని లోకాలకు వెళ్లిపోయారు. దేవరపల్లి – ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలం కామునిగూడెం గ్రామానికి చెందిన వరికుప్పల మల్లేష్‌ (40) నాలుగేళ్లుగా ఏపీలోని పోలవరం ప్రాజెక్టు వద్ద పనిచేస్తున్నారు. ఆయనతో పాటు అదే గ్రామానికి చెందిన ఉపేందర్‌ (32), అదే మండలానికి చెందిన వ్యాస వెంకటరెడ్డి కూడా అక్కడే ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వెళ్లే రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి సబ్‌ కాంట్రాక్టర్‌ వద్ద వీరు ఎర్త్‌ వర్క్‌ పనులు చేస్తున్నారు. దసరా పండుగ సమీపించడంతో ఈ ముగ్గురు తమ కుటుంబాలతో కలిసి పండుగ జరుపుకోవడానికి స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలో హైవేపై వీరు వెళ్తున్న టెంపో వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన ఓ లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టెంపో వెనుక భాగంలో కూర్చున్న మల్లేష్‌, ఉపేందర్‌ ఒక్కసారిగా వాహనం నుంచి కిందపడి లారీ టైర్ల కింద నలగడంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో వెంకటరెడ్డితో పాటు మరో ఐదుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వైరా పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను, మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైరా సీఐ వెంకటప్రసాద్‌, ఎస్సై పి. రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పండుగ వేళ వలస కార్మికులు మృత్యువాత పడడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.

తణుకు అర్బన్‌: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గతంలో మద్యం అక్రమ రవాణా, గంజాయి తదితర ఎకై ్సజ్‌ నేరాల్లో నిందితులుగా ఉన్న 29 మంది పాత నేరస్థులను తణుకు, ఇరగవరం తహసిల్దార్ల్ల ఎదుట బైండోవర్‌ చేసినట్లు తణుకు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖ సీఐ సత్తి మణికంఠరెడ్డి తెలిపారు. ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పన సొంత పూచీకత్తుపై విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement