నేడే పుర సమరం | - | Sakshi
Sakshi News home page

నేడే పుర సమరం

Nov 1 2026 4:37 AM | Updated on Nov 1 2026 4:37 AM

ఓటు వజ్రాయుధం

ఏలూరు నగరపాలక సంస్థ

నూజివీడు మున్సిపాలిటీ

జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ

న్యూస్‌రీల్‌

ఓటు వజ్రాయుధం
స్థానిక ఎన్నికల ప్రచార హోరు గ్రామాల్లో ఊపందుకుంది. పల్లెల్లో వెంకన్న సుప్రభాతం మోగకముందే అభ్యర్థుల ప్రచారాల హోరు మొదలవుతోంది. 8లో u

ఆదివారం శ్రీ 1 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, ఏలూరు: స్థానిక సంస్థల తొలిపోరుకు సర్వం సన్నద్ధమైంది. ఆదివారం జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థతో సహా రెండు మున్సిపాల్టీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా మూడు మున్సిపాల్టీల్లో పోలింగ్‌ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏలూరు నగరపాలక సంస్థ, జంగారెడ్డిగూడెం, నూజివీడు మున్సిపాల్టీల్లో మూడు స్థానాల్లో కలిపి 3,28,671 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ జరుగుతుంది.

376 పోలింగ్‌ కేంద్రాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జిల్లాలో ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం మున్సిపాల్టీల్లో ఆదివారం ఎన్నికల నిర్వహణకు వీలుగా సర్వం సన్నద్ధం చేశారు. మూడు కేంద్రాల్లో 376 పోలింగ్‌ కేంద్రాల్లో 130 వార్డులు, డివిజన్లల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, చైర్‌పర్సన్లు, మేయర్‌కు సంబంధించి ఓటర్లు రెండు ఓట్లు బ్యాలెట్‌ వినియోగించుకోనున్నారు. మరోవైపు జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఉదయం సర్‌ సీఆర్‌రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌లో ప్రత్యేకంగా 376 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి ఎన్నికల సామాగ్రిని, సిబ్బంది విధుల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేశారు. అలాగే పోలీస్‌ సిబ్బందికి కూడా బందోబస్తు డ్యూటీలు కేటాయించారు. పోలింగ్‌ నేపథ్యంలో 11 మంది జోనల్‌ అధికారులు, 31 మంది రూట్‌ ఆఫీసర్లను నియమించారు. మూడు చోట్ల 99 సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అదనపు బలగాలను భద్రత కోసం ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ప్రీసైడింగ్‌ అధికారి, అదనపు ప్రీసైడింగ్‌ అధికారి, ముగ్గురు పోలింగ్‌సిబ్బంది, ఒక మైక్రో అబ్జర్వర్‌ను నియమించారు. అలాగే సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ప్రక్రియ ముగించి రూట్‌ అధికారి నేతృత్వంలో పోలింగ్‌ మెటిరీయల్‌ను పోలింగ్‌ స్టేషన్‌కు పంపేలా ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం 6 గంటకల్లా పోలింగ్‌ కేంద్రాలు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

ఏలూరు నగరపాలక సంస్థలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మేయర్‌ అభ్యర్థిగా గంటా మోహనరావు (జీఎంఆర్‌), కూటమి అభ్యర్థిగా జనసేన నేత రెడ్డి అప్పలనాయుడు పోటీలో ఉన్నారు. 62 డివిజన్లల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులు, కూటమి నేతలు బరిలో నిలిచారు. ఏలూరు నగరంలో మొత్తం 255 పోలింగ్‌ బూత్‌ల్లో 2,37,256 మంది ఓటర్లు ఉండగా మహిళలు అత్యధికంగా 1,23,873, పురుషులు 1,13,332, ఇతరులు 51 ఓట్లు ఉన్నాయి.

నూజివీడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి కంచర్ల లవకుమార్‌, టీడీపీ అభ్యర్థిగా బర్రె ఇళయరాజాలు పోటీలో నిలిచారు. 36 వార్డుల్లో 57 పోలింగ్‌బూత్‌ల్లో 42,952 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 20,521 మంది పురుషులు, 22,425 మంది మహిళలు, ఆరుగురు ఇతరులున్నారు.

జంగారెడ్డిగూడెం వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా మేక సత్యవతి, టీడీపీ అభ్యర్థిగా రొంగల అనూషలు పోటీలో ఉన్నారు. 32 వార్డుల పరిధిలో 64 పోలింగ్‌కేంద్రాల్లో 48,463 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 23,409 మంది పురుషులు, 25,025 మంది మహిళలు, 29 మంది ఇతరులున్నారు.

ఓటుకు వేళాయే

జిల్లాలో మూడు మున్సిపాల్టీల్లో 3.28 లక్షల మంది ఓటర్లు

ఏలూరులో 255 కేంద్రాల్లో 2.35 లక్షల మంది ఓటర్లు

జంగారెడ్డిగూడెంలో 64 పోలింగ్‌ బూత్‌ల్లో 48 వేల మంది ఓటర్లు

నూజివీడులో 57 పోలింగ్‌ బూత్‌ల్లో 42 వేల మంది ఓటర్లు

ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియ పూర్తి

ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌

3న సీఆర్‌రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో కౌంటింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement