పోలింగ్‌ను పారదర్శకంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ను పారదర్శకంగా నిర్వహించాలి

Nov 1 2026 4:37 AM | Updated on Nov 1 2026 4:37 AM

ఆరోగ్యశ్రీ నిర్వీర్యం పోలింగ్‌ను పారదర్శకంగా నిర్వహించాలి

ఆరోగ్యశ్రీ నిర్వీర్యం
చంద్రబాబు ప్రభుత్వం ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిందని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు విమర్శించారు. 8లో u

నూజివీడు/ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట): జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థతో పాటు నూజివీడు, జంగారెడ్డిగూడెం పురపాలక సంఘాలలో ఆదివారం జరగనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి, ఎస్పీ కొమ్మి ప్రతాప శివకిశోర్‌ తెలిపారు. ఈ మూడు ప్రాంతాల్లోని 130 వార్డులు/డివిజన్లలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్‌పర్సన్లు, మేయర్‌ ఎన్నిక నిమిత్తం మొత్తం 3,28,671 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. శనివారం ఏలూరులోని సీఆర్‌ఆర్‌ పబ్లిక్‌ స్కూల్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎంజే అభిషేక్‌ గౌడతో కలిసి, నూజివీడులోని సారధి ఇంజనీరింగ్‌ కాలేజీలో నిర్వహించిన పోలింగ్‌ సామాగ్రి పంపిణీ కేంద్రాలను ఎస్పీతో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం నూజివీడు జెడ్పీ బాలికల హైస్కూల్‌లోని పోలింగ్‌ కేంద్రాన్ని, స్ట్రాంగ్‌ రూములు, కౌంటింగ్‌ హాళ్లను తనిఖీ చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సిబ్బంది ఉదయం 6 గంటలకే పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేయాలని, ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం పారదర్శకంగా, పక్షపాతం లేకుండా విధులు నిర్వర్తించాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 376 పోలింగ్‌ స్టేషన్లలో 99 కేంద్రాలను సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించి అదనపు బలగాలను మోహరించినట్లు ఎస్పీ తెలిపారు. 11 మంది జోనల్‌ అధికారులు, 31 మంది రూట్‌ ఆఫీసర్లు నిరంతరం పర్యవేక్షిస్తారని ఎస్పీ తెలిపారు. అలాగే పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, ఓటర్లు, అధికారిక పాస్‌లు ఉన్న ఏజెంట్లు మినహా అనధికార వ్యక్తులను అనుమతించవద్దని ఎస్పీ ఆదేశించారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద రెండంచెల భద్రత ఏర్పాటు చేశారు. ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా, ప్రశాంత వాతావరణంలో తమ విలువైన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. ఆయా కార్యక్రమాల్లో సబ్‌ కలెక్టర్‌ బొల్లిపల్లి వినూత్న, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సీహెచ్‌. శ్రావణ్‌ కుమార్‌ రెడ్డి, ఆర్డీఓలక్ష్మీప్రసన్న, మున్సిపల్‌ కమిషనర్లు ఎ. భానుప్రతాప్‌, కొరపాటి పీరయ్య, డీఎస్పీలు శ్రావణ్‌ కుమార్‌, కేవీవీఎన్వీ ప్రసాదరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement