
హెచ్‌ఐవీ నియంత్రణకు కృషి చేయాలి
గంజాయి నిందితుల అరెస్టు
పెదపాడు మండలం కలపర్రు టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీల్లో గంజాయిని గుర్తించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2లో u
ఏలూరు(మెట్రో): హెచ్‌ఐవీ వ్యాప్తిని అరికట్టేందుకు సంబంధింత శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 8,680 మందిని హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులుగా గుర్తించారని, వారికి ఆ వ్యాధి ఎవరి నుంచి సోకిందో మూల కారణాలు తెలుసుకుని, వారికి కూడా ఏఆర్‌టి చికిత్స అందించినప్పుడే వ్యాధి వ్యాప్తిని అరికట్టగలమన్నారు. వ్యాధిగ్రస్తులు మధ్యలో చికిత్స మానేయకుండా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వైద్యశాఖాధికారి పి.జె.అమృతం, ఐసీడీఎస్ పీడీ శారద తదితరులు పాల్గొన్నారు. అనంతరం హెచ్‌ఐవీ నియంత్రణపై గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. కిశోర వికాసం కార్యక్రమంలో కౌమార దశలో ఉన్న బాలికలకు వారి హక్కులు, భద్రతలపై అవగాహన కలిగించాలని కలెక్టర్ సూచించారు. కిశోర వికాసం కార్యక్రమంలో తీసుకోవాల్సిన అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు.