
రాష్ట్రస్థాయి యోగాసన పోటీలు ప్రారంభం
తాడేపల్లిగూడెం (టీఓసీ): ఏపీ రాష్ట్రస్థాయి ఆరోవ యోగాసన స్పోర్ట్స్ చాంపియన్ షిప్ పోటీలు గురువారం పెంటపాడు మండలం ప్రత్తిపాడులోని సరస్వతి విద్యాలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథులుగా యోగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ తరుఫున గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, డైరెక్టర్ రాధిక, రవీంద్రనాఽథ్, మునిసిపల్ కమిషనర్ యేసుబాబు, ఆరోగ్యశ్రీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ పల్లవి, లయన్స్ క్లబ్ తరుపున గట్టిం మాణిక్యాలరావు, డాక్టర్ కొలనువాడ పెద్ద కృష్ణంరాజు హాజరయ్యారు. పోటీలను యోగా కోచ్ కరిబండి రామకృష్ణ పర్యవేక్షించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన యోగా సభ్యులు కోడ్ ఆఫ్ బుక్ ప్రకారం వివిధ యోగాసనాలు వేశారు. వక్తలు మాట్లాడుతూ యోగాతో ఆరోగ్యం, మానసిక వికాసం, ఉన్నత ఆలోచనలు కలుగుతాయని చెప్పారు. ప్రతి ఒక్కరు యోగా చేయాలని కోరారు. పోటీల్లో విజేతలు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో యోగా సభ్యులు అపర్ణప్రసాద్, త్రిమూర్తులు, రాజా, నాగేశ్వరరావు, రాంబాబు, సుజాత, సుభద్ర, లక్ష్మి, యోగా గురువులు, కోచ్‌లు, జడ్జిలు పాల్గొన్నారు.