
పడకేసిన పల్లె ప్రగతి
న్యూస్‌రీల్
పారిశుద్ధ్య లేమి.. అధ్వానంగా వీధి దీపాల నిర్వహణ
శురకవారం శ్రీ 22 శ్రీ ఆగస్టు శ్రీ 2025
పంచాయతీల్లో పనులు చేయాలంటే 15వ ఆర్థిక సంఘం నిధులే కీలకం. ఈ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో పనులు చేయాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దీంతో పంచాయతీ పాలన కుంటుపడుతోంది. గ్రామస్తులు అడిగిన ఏ పనినీ చేయలేకపోతున్నాం. వెంటనే నిధులు విడుదల చేయాలి.
– డి.నాగమల్లేశ్వరరావు,
సర్పంచ్, సుంకొల్లు, నూజివీడు మండలం
వర్షాకాలం కావడంతో బ్లీచింగ్ చల్లుదామన్నా నిధులు లేవు. మురుగుకాల్వల్లో పూడిక తీద్దామన్నా, వీధిలైట్లు కొత్తవి ఏర్పాటు చేద్దామన్నా ఇబ్బందిగా ఉంది. 15వ ఆర్థిక సంఘం నిధులను జాప్యం చేయకుండా విడుదల చేస్తేనే గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయగలుగుతాం.
– పల్నాటి అనూష, సర్పంచ్,
దేవరగుంట, నూజివీడు మండలం
నూజివీడు: పల్లెలే దేశానికి పట్టుగొమ్మలంటారు. మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి చర్యలు తీసుకుంటేనే అవి పరిఢవిల్లేది. ప్రస్తుతం గ్రామాల్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. పల్లెల ప్రగతిలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధులు కీలకం. ఏటా రెండు విడతలుగా కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను పంచాయతీలకు విడుదల చేస్తుంది. అయితే వీటిని రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు మంజూరు చేయకుండా తీవ్ర జాప్యం చే స్తోంది. దీంతో పంచాయతీల్లో బ్లీచింగ్ కొనుగోలు చేయడానికి కూడా నిధులు లేక సర్పంచ్‌లు చిన్నపాటి పనులు కూడా చేయలేకపోతున్నారు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పడకేసింది. ఏ గ్రామంలో వీధులు చూసినా మురుగునీటి గుంతలతో, చెత్తాచెదారంతో దర్శనమిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది. గ్రామాల్లో ప్రజలకు జవాబుదారీగా ఉండే సర్పంచ్‌లు ఏ చిన్నపాటి పనీ చేయలేని దుస్థితిలో ఉన్నారు. పంచాయతీల అభివృద్ధికి, అత్యవసర పనులకు ఆర్థిక సంఘం నిధులు భరోసాగా ఉంటాయి.
547 పంచాయతీలు.. రూ.70 కోట్లు
జిల్లాలో 27 మండలాల్లోని 547 పంచాయతీలకు 15 ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ.70 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. వీటిని రెండు విడతలుగా ఆయా గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తుంది. గ్రామ జనాభా ప్రాతిపదికన ఈ నిధులను మంజూరు చేస్తారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడత నిధులను గతేడాది నవంబరులో విడుదల చేయగా అవి పంచాయతీలకు జమయ్యాయి. రెండో విడత నిధులు రెండు నెలల క్రితం విడుదల చేసినా ఇప్పటికీ రాష్ట్ర ప్ర భుత్వం పంచాయతీలకు జమ చేయకుండా ప్ర భుత్వ అవసరాలకు వాడేసింది.
15వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులు విడుదల కాకపోవడంతో జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో అభివృద్ధి పడకేసింది. ఏ పనులు ముందుకు సాగడం లేదు. గ్రామస్తులు అడిగే పనులు చేద్దామన్నా నిధులు లేక సర్పంచులు మిన్నకుంటున్నారు. వర్షాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణకు ఈ నిధులు చాలా అవసరం. మురుగునీరు నిల్వ ఉండే గుంతల్లో బ్లీచింగ్ కూడా చల్లలేకపోతున్నామని, ఎవరైనా వీధి దీపం పోయిందని కొత్తది వేయమని అడిగినా వేయలేని పరిస్థితిలో ఉన్నామని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాలకు చేరని 15వ ఆర్థిక సంఘం నిధులు
కేంద్రం విడుదల చేసినా గ్రామాలకు మంజూరు చేయని రాష్ట్ర ప్రభుత్వం
రెండో విడత నిధుల విడుదలలో జాప్యం
నిధుల లేమితో అభివృద్ధికి నోచుకోని గ్రామాలు
అసలే వర్షాకాలం.. వ్యాధులు ప్రబలే ప్రమాదం

పడకేసిన పల్లె ప్రగతి

పడకేసిన పల్లె ప్రగతి

పడకేసిన పల్లె ప్రగతి

పడకేసిన పల్లె ప్రగతి