
పోటెత్తిన గోదావరి
పోలవరం రూరల్: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద 52.10 మీటర్లకు నీటిమట్టం చే రుకుంది. ఎగువ ప్రాంతాల్లో ఉప నదులతో పాటు శబరి నీరు కూడా కలవడంతో వరద ఉధృతి క్రమేపీ పెరుగుతోంది. గురువారం పోలవరం ప్రాజెక్టు స్పి ల్‌వే వద్ద 33.160 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. సుమారు 11.10 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు చేరుతోంది. ఎగువ ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టినా దిగువన వరద పెరుగుతోంది.
కుక్కునూరు మండలంలో..
కుక్కునూరు: కుక్కునూరు మండలంలో పలు గ్రా మాలను వరద చుట్టుముట్టింది. కుక్కునూరులో శి వాలయం వద్దకు, పాతూరులో రామాలయం సమీపంలోకి నీరు చేరడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వేలేరు నుంచి సీతారామనగరం వెళ్లే రహదారి నీటమునగడంతో వేలేరు–సీతారామనగ రం మధ్య రాకపోకలు స్తంభించాయి. వరద మరో అడుగు పెరిగితే వింజరం వద్ద ఆర్‌అండ్‌బీ రహదారిపై నీరు చేరి రాకపోకలు స్తంభించనున్నాయి. ప లు ప్రాంతాల్లో పత్తి, వరి చేలు ముంపు బారిన పడ్డాయి. గుండేటి వాగు సమీపంలో సీతారామనగరం గ్రామం వద్ద ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను అధికారులు సిద్ధం చేశారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన
వేలేరుపాడు: వేలేరుపాడు మండలంలోని వరద ప్ర భావిత ప్రాంతాల్లో కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జేసీ పి.ధాత్రిరెడ్డి పర్యటించారు. చిగురుమామిడిని సందర్శించి వరద బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. భద్రాచలంలో గోదావరిలో నీటిమట్టం 51.90 అడుగులుగా నమోదైందన్నారు. ఈ నీరు జిల్లా సరిహద్దులోకి రావడానికి 24 గంటల సమ యం పడుతుందన్నారు. ఈ దృష్ట్యా వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశామని చెప్పారు. వేలేరుపాడు మండలంలో 23 నివాసిత ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయన్నారు. కుక్కునూరులోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో పునరావాస కేంద్రం ఏర్పాటుచేసి 150 కుటుంబాలను తరలించామన్నారు. కుక్కునూరు మండలంలో వరద ముంపు గ్రామాలైన కొమ్ముగూడెం, లచ్చుగూడెం ప్రజలను దాచారం సహాయ శిబిరానికి తరలించామన్నారు. కుక్కునూరు మండలంలో మూడు గ్రామాల్లోని ఆరు నివాసిత ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయన్నారు. మొత్తం 3,690 కుటుంబాలు వరద బాధితులుగా ఉన్నాయన్నారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవీ రమణ, డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఫిషరీస్ డీడీ నరసయ్య, ఎంపీడీవో శ్రీహరి ఉన్నారు.
అధికారులూ.. అప్రమత్తం
వరద ప్రభావం తగ్గే వరకు అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో ఆమె సమీక్షించారు.
భద్రాచలం వద్ద 51.90 అడుగులకు నీటిమట్టం
జిల్లాలో 3,690 కుటుంబాలపై వరద ప్రభావం
పోలవరం ప్రాజెక్టు నుంచి 11.10 లక్షల క్యూసెక్కులు దిగువకు..

పోటెత్తిన గోదావరి

పోటెత్తిన గోదావరి