స్ఫూర్తి నింపిన ‘ఆడుదాం ఆంధ్ర’ | - | Sakshi
Sakshi News home page

స్ఫూర్తి నింపిన ‘ఆడుదాం ఆంధ్ర’

Feb 16 2024 12:54 AM | Updated on Feb 16 2024 7:24 PM

ఏలూరులో జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో తలపడుతున్న క్రీడాకారులు (ఫైల్‌)  - Sakshi

ఏలూరులో జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో తలపడుతున్న క్రీడాకారులు (ఫైల్‌)

ఏలూరు రూరల్‌: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల నిర్వహణపై క్రీడాభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పోటీలు క్రీడాలోకానికి నూతన ఉత్తేజాన్ని అందించాయని ఆనందం వెలిబుచ్చుతున్నారు. ఈ పోటీల్లో ఏలూరు జిల్లా బ్యాడ్మింటెన్‌, క్రికెట్‌ జట్లు రాష్ట్ర చాంపియన్లుగా అవతరించడంపై క్రీడాకారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఈ పోటీలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపాయని చెబుతున్నారు. 2023 డిసెంబర్‌ 26వ తేదీన సచివాలయ స్థాయిలో ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకు జరిగిన ఈ పోటీల్లో సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎందరో క్రీడాకారులు అద్భుత ప్రతిభ, పాఠవాలు ప్రదర్శించారని, ప్రతిభ కలిగిన ఎందరో క్రీడాకారులు వెలుగులోకి వచ్చారని అంటున్నారు.

వెలుగులోకి మట్టిలో మాణిక్యాలు

పోటీల నిర్వహణపై సర్వత్రా ప్రశంస

చాంపియన్లుగా అవతరించిన

ఏలూరు జిల్లా క్రికెట్‌, బ్యాడ్మింటన్‌ జట్లు

బ్యాడ్మింటన్‌లో రాష్ట్ర స్థాయిలో ప్రథమస్థానం సాధించిన ఏలూరు జిల్లా జట్టు (ఫైల్‌) 1
1/1

బ్యాడ్మింటన్‌లో రాష్ట్ర స్థాయిలో ప్రథమస్థానం సాధించిన ఏలూరు జిల్లా జట్టు (ఫైల్‌)

Advertisement
 
Advertisement
Advertisement