● 5న దేవరపల్లిలో పర్యటన
● పొగాకు రైతులూ తరలిరండి
● ప్రభుత్వం దిగి వచ్చేవరకూ పోరాటం
● వైఎస్సార్‌సీపీ నేతల పిలుపు
బుట్టాయగూడెం(జంగారెడ్డిగూడెం): పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈనెల 5న దేవరపల్లిలో పర్యటించనున్నారని ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు జెట్టి గురునాథరావు తెలిపారు. శుక్రవారం జంగారెడ్డిగూడెంలో గురునాథరావు కార్యాలయం వద్ద పోలవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు అధ్యక్షతన జగన్ పర్యటన ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు.
పట్టించుకోని కూటమి ప్రభుత్వం
నాయకులు మాట్లాడుతూ.. ప్రస్తుతం గిట్టుబాటు ధర లేక పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకే జగన్ దేవరపల్లి వస్తున్నారని చెప్పారు. గతంలో జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన ‘పొగా కు రైతుల గర్జన’ తర్వాత జగన్ తాడేపల్లిలో రైతులతో సమావేశమయ్యారని గుర్తుచేశారు. ఆ సమయంలో ప్రభుత్వం హామీలు ఇచ్చినా రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. ప్రభు త్వం కళ్లు తెరిచేలా జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, బుట్టాయగూడెం ప్రాంతాల పొగాకు రైతులు భారీగా తరలివచ్చి ఈ పర్యటనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర లభించే వరకూ వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే పు ప్పాల వాసుబాబు, ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి జయప్రకాష్, బూత్ కమిటీ రీజనల్ కో–ఆర్డినేటర్ బీవీఆర్ చౌదరి, పోలవరం, భీమవరం నియోజకవర్గ పరిశీలకులు కనుమూరి శివరామరాజు, మంతెన సోమరాజు, మాజీ ఏఎంసీ చైర్‌పర్సన్ జగ్గారపు జానకిరెడ్డి, నాయకులు బొడ్డు వెంకటేశ్వరరావు, మేడారపు విద్యాసాగర్, బండారు గంగాప్రసాద్, పోలవరం, చింతలపూడి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సుంకర వెంకటరెడ్డి, గంజిమాల రామారావు, ఆరేటి సత్యనారాయణ, గంటా శ్రీను, నాయకులు ఓరుగంటి నాగేంద్రకుమార్, తుమ్మలపల్లి గంగరాజు, రాయి అంకుల సత్యనారాయణ, కర్పూరం గవరయ్య, గుప్తా నాగు, జెట్టి సత్య ఆదిత్య, ముప్పిడి శ్రీనివాసరావు, కుక్కల ధర్మరాజు, కుర్రు రవి, బత్తిన చిన్న, నీకూరి కిషోర్, శేషారెడ్డి, ఉమా మహేశ్వరరావు, షరీఫ్, అక్టర్, జాని, ఆరీఫ్, తదితరులు పాల్గొన్నారు.


