● మెగా కాదు దగా డీఎస్సీ
● టీచర్ల నియామకాల్లో అక్రమాలు
● సీబీఐ విచారణ చేయించాలి
● వైఎస్సార్‌సీపీ నాయకుల డిమాండ్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): డీఎస్సీ–2025 స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలని, పరీక్ష పత్రాల లీకేజీ, అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ నా యకులు డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పీఏసీ మెంబర్, ఉంగుటూరు నియోజకవర్గ ఇన్‌చార్జి పు ప్పాల వాసుబాబు, ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్‌తో కలిసి ఏలూరులో డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. డీఎస్సీలో అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నాయకులు మాట్లాడుతూ డీఎస్సీ–2025లో పలు అవకతవకలు జరిగాయని స్పష్టమైన ఆధారాలున్నాయన్నారు. బ్రిడ్జి గేమ్‌ను కూడా క్రీడా కోటాలోకి చొప్పించడం సిగ్గుచేటన్నారు. క్రీడా కోటాల కింద జరిగిన నియామకాల్లో భారీ కుంభకోణమే దాగుందన్నారు. అర్హులైన అనేక మంది రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ న్యాయం జరిగి వారిని ఉద్యో గాల్లోకి తీసుకునే వరకూ వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. విద్యాదీవెన, వసతిదీ వెన బకాయిలు తక్షణమే చెల్లించాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేశా రు. నాయకులు గుడిదేశి శ్రీనివాసరావు, దాసరి రమేష్, డీవీఆర్‌కే చౌదరి, మున్నుల జాన్‌గురు నాథ్, నెరుసు చిరంజీవులు, కిలాడి దుర్గారావు, గంట మోహన్‌రావు, లోటుకుర్తి సుభాష్, వేంపాటి స్టాలిన్ బాబు, జెడ్పీటీసీ కావీ, కె.జనార్దన్, ఎస్.యుగంధర్ ప్రసాద్, కంచుమర్తి తులసి, జుజ్జువరపు విజయనిర్మల, చిలకపాటి డింపుల్ జాబు, బసవ, సింగంశెట్టి రాము పాల్గొన్నారు.


