జాతీయ రగ్బీ జట్టుకు హరిణి
తుని రూరల్: వి.కొత్తూరు గ్రామానికి చెందిన రొంగల హరిణి ఎస్‌జీఎఫ్‌ఐ జాతీయ స్థాయి అండర్–14 జట్టుకు ఎంపికై నట్టు జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం వి.అప్పారావు బుధవారం తెలిపారు. చిత్తూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో విశేష ప్రతిభకనబర్చడంతో హరిణి జాతీయస్థాయికి ఎంపికై నట్టు తెలిపారు. ఈ నెల 23 నుంచి 28 వరకు న్యూ ఢిల్లీ త్యాగరాజు స్టేడియంలో జరిగే పోటీల్లో పాల్గొంటుందన్నారు. పీడీ సీహెచ్ లోవలక్ష్మి అండర్–14 రగ్బీ బాలికల ఆంధ్ర ప్రదేశ్ జట్టుకు మేనేజరుగా ఎంపికై నట్టు ఆయన పేర్కొన్నారు.


