ఆత్రేయపురం: స్థానిక ఎన్నికల కోడ్ అమలులో అధికారులు వెనకడుగు వేస్తున్నారు. ఆత్రేయపురం మండలంలో ఎక్కడపడితే అక్కడ ఉన్న పసుపు రంగు దిమ్మలు, ఫ్లెక్సీల తొలగింపులో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ర్యాలి గ్రామంలో వైఎస్సార్ సీపీకి చెందిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి మాత్రం కోడ్ అమల్లోకి రావడంతోనే ముసుగు వేసేశారు. ఆత్రేయపురం రావిచెట్టు సెంటర్లో ఇప్పటికీ టీడీపీ దిమ్మకు ముసుగు వేయలేదు. అధికారులు వివక్ష చూపకుండా ఎన్నికల కోడ్ అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.


