మంచిని బతికిద్దాం.. చెడును అంతం చేద్దాం.. మంచితనపు వెలుగును నింపుకొందాం అనే నినాదంతో సాగిన రావణాసుర దహనం ఆకట్టుకుంది. మంగళవారం రాత్రి విజయదశమి రోజున స్థానిక సూర్యారావుపేట బీచ్‌లో 40 అడుగుల రావణాసురుని కటౌట్‌ను దహనం చేశారు. ప్రత్తిపాడు మండలం చింతలూరు గ్రామానికి చెందిన కర్రి మురళి నిర్వహణలో శ్రీశ్యామలాదేవి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. బెంగాల్ నుంచి వచ్చిన నిపుణులు నాలుగు రోజులపాటు శ్రమించి ఈ కటౌట్ తయారు చేసి వారి సమక్షంలో దహనం చేశారు. రెండేళ్లుగా అన్నవరంలో రావణ వధ చేపడుతున్నామని, తొలిసారిగా కాకినాడ బీచ్‌లో నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు.
– కాకినాడ రూరల్


