ఎటపాక: అనుమతులు లేకుండా తెల్లరాయి తరలిస్తున్న రెండు లారీలను అటవీశాఖ అధికారులు సోమవారం రాత్రి పట్టుకున్నారు. మండల పరిధిలో నెల్లిపాక జాతీయ రహదారిపై ఉన్న అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా తెల్లరాయితో చింతూరు మండలం గూడూరు నుంచి వస్తున్న రెండు లారీలను గుర్తించి నిలిపివేశారు. వాహనాల డ్రైవర్ల వద్ద ఎటువంటి అనుమతులు లేకపోవడంతో లారీలను పురుషోత్తపట్నంలోని నెల్లిపాక రేంజ్ కార్యాలయానికి తరలించారు. తెల్లరాయి లారీల సమాచారాన్ని మైనింగ్ అధికారులకు తెలియజేసినట్లు రేంజర్ సత్యనారాయణమూర్తి తెలిపారు. తెల్లరాయిని గూడూరు నుంచి తెలంగాణ రాష్ట్రంలోని సత్తుపల్లికి తరలిస్తున్నట్లు తెలిపారు.


