రాజకీయ కక్షకు పేదల ఆశలు ఆవిరి | - | Sakshi
Sakshi News home page

రాజకీయ కక్షకు పేదల ఆశలు ఆవిరి

Oct 22 2026 12:45 AM | Updated on Oct 22 2026 12:45 AM

ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాల నిర్వహణ ఆగకూడదు. తద్వారా లబ్ధిదారులను ఇబ్బందిపెట్టే చర్యలకు పూనుకోకూడదు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పన, నిర్వహణపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది. వెలుగుబంద, తొర్రేడు వంటి భారీ లే అవుట్లతో వేలాది కుటుంబాల భవితవ్యం ముడిపడి ఉంది. జగన్‌మోహన్‌రెడ్డికి మంచి పేరు వస్తుందనే చంద్రబాబు ప్రభుత్వం జగనన్న కాలనీలను నిర్లక్ష్యం చేస్తోందని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం వేసిన పునాదులపై మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి, ఆగిపోయిన ఇళ్లను పూర్తి చేయించి, పేదల సొంతింటి కలను సాకారం చేసే బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement