నిబంధనలను తొక్కేసి.. | - | Sakshi
Sakshi News home page

నిబంధనలను తొక్కేసి..

Oct 22 2026 12:45 AM | Updated on Oct 22 2026 12:45 AM

టీడీపీ అత్యుత్సాహం!

ద్వారకాతిరుమల: ఎన్నికల నామినేషన్ల తొలిరోజు టీడీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్న పోలీసులపై వాగ్వాదానికి దిగారు. ఆ వివరాల్లోకి వెళితే.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల నేపథ్యంలో ద్వారకాతిరుమల ఎంపీడీఓ కార్యాలయం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయానికి సుమారు 100 అడుగుల దూరంలో పోలీస్‌ స్టేషన్‌ సమీపాన రహదారిపై బారికేడ్లు పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎస్సై టి.సుధీర్‌ సిబ్బందితో పర్యవేక్షణ చేపట్టారు. నామినేషన్‌ వేసే అభ్యర్థులు, వారి ఇద్దరు ప్రతిపాదకులు, డమ్మీ అభ్యర్థులను మాత్రమే లోపలకు అనుమతించారు. ఈ క్రమంలో పంగిడిగూడెం నుంచి వైఎస్సార్‌ సీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. దీంతో అక్కడికి వచ్చిన కొందరు టీడీపీ నాయకులు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులతో పాటు మాజీ ఎంపీపీ, మరో బీసీ సామాజికవర్గ నాయకుడిని ఎలా అనుమతించారంటూ పోలీసులను నిలదీశారు. వారు అభ్యర్థుల ప్రతిపాదకులని ఎస్సై, సిబ్బంది స్పష్టం చేసినా ఏమాత్రం తగ్గకుండా వాగ్వాదానికి దిగారు. ఎన్నికల నిబంధనల అమలులో భాగంగా పోలీసులు తీసుకున్న చర్యలపై ఇలా అభ్యంతరం వ్యక్తం చేయడం అక్కడున్న వారిని విస్మయానికి గురిచేసింది.

అధికారం చేతిలో ఉంటే దేనినైనా మార్చేయవచ్చు.. నిబంధనలను పక్కన బెట్టేయచ్చని కూటమి నేతలు నిరూపిస్తున్నారు.. ఎన్నికల వేళ కోడ్‌ను ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు.. ప్రతిపక్ష పార్టీకి సవాలక్ష నిబంధనలు పెట్టి ఇబ్బంది పెడుతున్న అధికారులు, ఈ కోడ్‌ ఉల్లంఘనులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం.

కాకినాడ రూరల్‌: కాకినాడ రూరల్‌లో అధికార పార్టీ నాయకులు నిబంధనలకు పాతర వేశారు. అనుమతులు లేకుండా భారీ బైక్‌ ర్యాలీని బుధవారం నిర్వహించారు. ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో తొలిరోజే మండలంలోని టీడీపీ నాయకులు ఆ పార్టీ జెండాలను కట్టుకుని బైక్‌ ర్యాలీ చేపట్టారు. సర్పవరం గ్రామం నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ కొనసాగింది. వీరంతా ఇటీవలే టీడీపీ కండువాలు వేసుకున్నారు. సర్పంచ్‌ పదవి కోసం టీడీపీ పక్షాన చేరిన చందు ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించడంతో అనుమతి లేకపోయినా, సర్పవరం పోలీసులు నిలువరించలేదు. మరోవైపు చందు తీరు కూటమి భాగస్వామ్య పార్టీ జనసేనకు మింగుడు పడడం లేదు. జనసేన, టీడీపీ మధ్య సీట్ల పంపకం తేలక ముందే సర్పవరంలోని నాలుగు ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ నుంచి నామినేషన్లను వేయించడంతో జనసేన నాయకులు గుర్రుగా ఉన్నారు.

‘కోడ్‌’ వర్తించదా

అంబాజీపేట: పుల్లేటికుర్రు జెడ్పీ హైస్కూల్‌ ప్రహరీపై పల్లె పండుగ అంటూ పవన్‌ కళ్యాణ్‌ వాల్‌ పోస్టర్‌ దర్శనమిస్తుంది. ఇది పంచాయతీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉంది. అధికార పార్టీ చెందిన వారికి ఎన్నికల్‌ కోడ్‌ వర్తించదా? లేక అధికారుల నిర్లక్ష్యమా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement