వైఎస్సార్‌ సీపీలోకి టీడీపీ నేతల చేరిక | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలోకి టీడీపీ నేతల చేరిక

Oct 22 2026 12:51 AM | Updated on Oct 22 2026 12:51 AM

నిడదవోలు: పట్టణ టీడీపీలో ఒంటెద్దు పోకడలు నచ్చక ముస్లింలకు న్యాయం జరిగేది వైఎస్సార్‌ సీపీలోనే అని విశ్వసించి ఆ పార్టీకి చెందిన మాజీ మున్సిపల్‌ కౌన్సిలర్‌ ఎస్‌కే రెహనా, టీడీపీ పట్టణ తెలుగు యువత మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ డైరెక్టర్‌ ఎస్‌కే లాల్‌ బహుదూర్‌ (బాబు)తో పాటు సుమారు 50 మంది టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీని వీడి వైఎస్సార్‌ సీపీలో చేరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి జి.శ్రీనివాస్‌నాయుడు సమక్షంలో వారు పార్టీలో చేరారు. 22వ వార్డు ఇన్‌చార్జి గంట సురేష్‌ ఆధ్వర్యంలో వారందరికి ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ 1989 నుంచి టీడీపీలో ఉంటూ పార్టీకి అనేక సేవలందిచామని, ప్రస్తుతం టీడీపీ అనుసరిస్తున్న విధానాలకు విరక్తి చెందామన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి సత్యనారాయణ, మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి వేదాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement