సుప్రీం తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు | - | Sakshi
Sakshi News home page

సుప్రీం తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు

Oct 22 2026 12:51 AM | Updated on Oct 22 2026 12:51 AM

రాజమహేంద్రవరం సిటీ: స్థానిక ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, చంద్రబాబు కూటమి ప్రభుత్వం, పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని, సుప్రీంకోర్టు ఆదేశాలతో సిగ్గు తెచ్చుకుని ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ బుధవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభు త్వం పోలీసులను, ఎస్‌ఈసీని అడ్డుపెట్టుకుని హింసను ప్రేరేపించి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలతో పాటు నాలుగో పార్టీగా పోలీసులు, 5వ పార్టీగా ఎస్‌ఈసీ మారిపోయారని ఆరోపించారు. వారందరూ కలిసి ఒక్క జగన్‌మోహన్‌ రెడ్డిని ఎదుర్కొవడానికి అడ్డమైన కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు తమ ఖాకీ చొక్కాలు తీసేసి పసుపు చొక్కాలు వేసుకుని ఉద్యోగాలు చేసుకోవాలని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం పొగరు అణచడానికి స్థానిక ఎన్నికలను రాష్ట్ర ప్రజలు ఒక ఆయుధంగా మలుచుకుని ప్రతిపక్షానికి ఓటు వేయాలని, అలా చేయకపోతే రాష్ట్రంలో కుట్రలు, కుతంత్రాలు, అరాచకాలకు అడ్డు, అదుపు ఉండవన్నారు. రాష్ట్రంలో పోలీసు శాఖ ఎలా పనిచేస్తుందో చంద్రబాబు ఇప్పటికై నా తెలుసుకోవాలని, వ్యవస్థ ఇలాగే ఉంటే ప్రజలు కచ్చితంగా ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడం ఖాయమని స్పష్టం చేశారు. వైఎస్సార్‌ సీపీ అన్ని చోట్లా నామినేషన్లు దాఖలు చేసి పోటీలో నిలవడంతో పాటు కచ్చితంగా గెలిచి తీరుతుందని భరత్‌ రామ్‌ అన్నారు. కూటమి ప్రభుత్వం తమ రెండున్నరేళ్ల పాలనపై ఈ స్థానిక సంస్థల ఎన్నికలను రిఫరెండంగా తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

స్థానిక ఎన్నికల నిర్వహణలో ఎస్‌ఈసీ, పోలీసుల ఘోర వైఫల్యం

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను

నామినేషన్లు కూడా వేయనివ్వడం లేదు

మాజీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement