ఆరోపణలే కల్తీ... లడ్డూ శ్రేష్ఠమే | - | Sakshi
Sakshi News home page

ఆరోపణలే కల్తీ... లడ్డూ శ్రేష్ఠమే

Sep 21 2026 12:14 AM | Updated on Sep 21 2026 12:14 AM

సాక్షి, రాజమహేంద్రవరం/ రాజమహేంద్రవరం సిటీ/ సీటీఆర్‌ఐ/ ప్రకాశంనగర్‌: కోట్లాది మంది భక్తుల విశ్వాసాలతో ముడిపడిన తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదంపై చేసిన ఆరోపణలన్నీ రాజకీయ స్వార్థంతో చేసినవేనని తేలిపోయింది. లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ చేసిన తప్పుడు ఆరోపణలు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు అసలు కల్తీనే జరగలేదని నిర్ధారించారు. ఈ మేరకు జంతువుల కొవ్వు ఆనవాళ్లే లేవని నిర్ధారిస్తూ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో తప్పుడు ఆరోపణలు చేసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ బహిరంగ క్షమాపణలు చెప్పాలని భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి ఆరోపణులు చేయడం సరైన పద్ధతి కాదని మండిపడుతున్నారు.

తిరుమల లడ్డూలో

జంతువుల కొవ్వు ఆనవాళ్లే లేవు

స్పష్టం చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌

డైరెక్టరేట్‌ అధికారులు

రాజకీయ స్వార్థంతోనే

పవన్‌, చంద్రబాబు ఆరోపణలు

క్షమాపణలు చెప్పాల్సిందేనంటున్న

శ్రీవారి భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement