అనపర్తి: ఇటీవల విడుదలైన నీట్ పీజీ ప్రవేశ పరీక్షల్లో అనపర్తికి చెందిన చిన్నం గంగాధర్‌రెడ్డి, లక్ష్మీతులసి దంపతుల కుమారుడు, యువ వైద్యుడు అజయ్ కుమార్ రెడ్డి ఆలిండియా 274వ ర్యాంక్ సాధించారు. తమ కుమారుడు శ్రీకాకుళం జిల్లా గ్రేట్ ఈస్ట్రన్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్‌లో గోల్డ్ మెడల్ కూడా సాధించినట్టు గంగాధరరెడ్డి తెలిపారు. వైద్య విద్యలో వివిధ విభాగాల్లో ప్రతిభ చూపి, 13 బంగారు పతకాలు సాధించారని చెప్పారు. డాక్టర్ అజయ్ కుమార్ రెడ్డి సోదరి లక్ష్మీదీప్తి జీఎస్‌ఎల్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. వైద్య విద్యలో అక్కా తమ్ముళ్లు రికార్డ్ సృష్టించడం విశేషం. పలువురు ప్రముఖులు అజయ్‌ను అభినందించారు.


