యువకుడిని ట్రాక్‌పై కొట్టుకుంటూ తీసుకెళ్లిన ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది | - | Sakshi
Sakshi News home page

యువకుడిని ట్రాక్‌పై కొట్టుకుంటూ తీసుకెళ్లిన ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది

Sep 26 2026 12:32 AM | Updated on Sep 26 2026 12:32 AM

సామర్లకోట: రైల్వే రక్షక దళం (ఆర్‌పీఎఫ్‌) పోలీసులు ఓ యువకుడిని రైల్వే ట్రాక్‌పై కొట్టుకుంటూ నడిపించుకుని తీసుకెళ్లిన ఘటన విమర్శలకు దారి తీసింది. వివరాలివీ.. ల్యాప్‌టాప్‌లు దొంగిలిస్తున్నాడనే ఆరోపణలపై ఆ యువకుడిని సామర్లకోట రైల్వే స్టేషన్‌లో ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది శుక్రవారం పట్టుకున్నారు. అతడిని స్టేషన్‌లో రైల్వే ట్రాక్‌పై కొట్టుకుంటూ నడిపించుకుని తీసుకెళ్లి, ప్రభుత్వ రైల్వే పోలీసుల(జీఆర్‌పీ)కి అప్పగించారు. ప్లాట్‌ఫారంపై అందరూ చూస్తూండగానే ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో రావడం చర్చనీయాంశంగా మారింది. తమ కళ్ల ముందే ఆ యువకుడిని ఆవిధంగా తరలించడంపై ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఏ తప్పు చేసినప్పటికీ ఆ యువకుడిని ఇలా ట్రాక్‌పై నడిపిస్తూ, కొట్టడం సరికాదని ప్రయాణికులు అంటున్నారు. సామాన్య ప్రయాణికులు ట్రాక్‌పై నడిస్తే రూ.500 జరిమానా వేసిన ఆర్‌పీఎఫ్‌, ఇప్పుడు తామే ట్రాక్‌పై ఓ వ్యక్తిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లడాన్ని పలువురు తప్పు పట్టారు. ఇది ప్రయాణికుల భద్రత నిబంధనలకు విరుద్ధమని, ఆ సమయంలో రైలు వస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. ల్యాప్‌టాప్‌లు దొంగిలిస్తున్న యువకుడిని అదుపులో తీసుకున్నామని, దీనిపై విచారణ కొనసాగుతుందని రైల్వే పోలీసులు చెప్పారు.

ఫ సామర్లకోట రైల్వే స్టేషన్‌లో ఘటన

ఫ వారి తీరుపై ప్రయాణికుల విమర్శలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement