బాలుడు అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

బాలుడు అదృశ్యం

Sep 25 2026 12:47 AM | Updated on Sep 25 2026 12:47 AM

అనపర్తి: బాలుడి అదృశ్యంపై అనపర్తి పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఎస్సై బి.వినయ్‌ ప్రతాప్‌ కథనం ప్రకారం.. సంచార జాతులకు చెందిన రాచూరి పద్మ, బ్రహ్మరాజు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. స్థానిక లారీ యూనియన్‌ ఆఫీసు వద్ద తాత్కాలిక టెంట్‌ వేసుకుని నివాసం ఉంటున్న ఆ దంపతులు చుట్టుపక్కల ఎలుకలను పట్టుకునే వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తాము ఏర్పాటు చేసుకున్న మకాం వద్ద పిల్లలనుంచి బుధవారం తెల్లవారుజామున కొప్పవరంలో ఎలుకలు పట్టడానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి వారి ఆరేళ్ల కుమారుడు కృష్ణ కనిపించలేదు. అతడి కోసం బ్రహ్మరాజు దంపతులు చుట్టుపక్కల ప్రాంతాలు, సమీప గ్రామాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. బాలుడి తల్లి పద్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement