ఎటపాక: కవి సమ్మేళనాలు తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతాయని భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ అన్నారు. ఆదివారం శ్రీకళావేదిక 176వ శతాధిక కవి సమ్మేళనం డాక్టర్ పాల్‌రాజ్ ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీఓ మాట్లాడుతూ..తెలుగు వారసత్వ సంపద భావితరాలకు అందించాలని సమాజాన్ని కవులు తమ కవితల ద్వారా చైతన్యపర్చాలని అన్నారు. ఇటువంటి కవి సమ్మేళనాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కవులకు అక్షర కిరీటి బిరుదును ప్రదానం చేశారు. అనంతరం కవులకు పూలదండలు వేసి శాలువాలు వేసి మెమొంటోలు ఇచ్చి సత్కరించారు. కార్యక్రమంలో తాళ్లూరి పంచాక్షరియ్య, కళావేదిక జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం, పార్థసారథి, అజిత్, తోటమల్ల సురేష్‌బాబు, నజీర్, పూర్ణిమ, రమణ, దుర్గాప్రసాద్, బిక్షం తదితరులున్నారు.
రెవెన్యూ ఉద్యోగుల
రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు
రంపచోడవరం: విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో రెవెన్యూ ఉద్యోగుల 18వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగిందని, పోలవరం జిల్లా నుంచి హడాక్ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎస్‌కే ఫయాజ్ బాషా (జిలాని) తెలిపారు. కౌన్సిల్‌లో 28 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగులతో సమావేశం జరిగిందన్నారు. అనంతరం ఏపీఆర్‌ఎస్‌ఏ ఆరో రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు కూడా జరిగాయి. పోలవరం జిల్లా నుంచి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా షేక్ ఫయాజ్ బాషా (జిలాని)ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని వెల్లడించారు.


