30 సంవత్సరాలు సర్వీసు చేసిన సీనియర్ ఉపాధ్యాయులు ఆన్‌లైన్ విధానంలో టెట్‌కు అటెండ్ కాలేరనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లాం. ఆఫ్‌లైన్‌లోనే అని చెప్పి, ఆన్‌లైన్‌లో టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వం మాట తప్పింది. స్పెషల్ టెట్‌పై ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నాం.
– పోతంశెట్టి దొరబాబు, ఎస్‌టీయూ
కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి
ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించాలి
ఇతర రాష్ట్రాల మాదిరిగానే స్పెషల్ టెట్ ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించాలి. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనిపై ఉద్యమబాట పడుతున్నాం.
– ఈవీవీఎస్‌ఎస్ ప్రసాద్, యూటీఎఫ్
తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు
మినహాయింపు ఇవ్వాల్సిందే
ఉపాధ్యాయుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఇదేనా? తమిళనాడు ప్రభుత్వం మాదిరిగా ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాల్సిందే.
– ఎస్‌ఎన్ మునేశ్వరరావు,
ఏపీటీఎఫ్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు


