జాతీయ స్థాయి కరాటే పోటీలు ప్రారంభం
సామర్లకోట: స్థానిక ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని డీఎన్‌ఆర్ కల్యాణ మండపంలో జాతీయ స్థాయి కరాటే పోటీలు ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. స్థానిక కరాటే కోచ్ డి.శంకర్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ పోటీల్లో 10 రాష్ట్రాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వివిధ కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ మొదటి వైస్ గవర్నర్ చిట్టినీడి శ్రీనివాసరావు, కరాటే ఇండియా చీఫ్ మల్లికార్జునగౌడ్ ఈ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పూర్వ గవర్నర్ ఈదల ఈశ్వర కుమార్, జిల్లా చైర్మన్ చిత్తూలూరి వీర్రాజు, క్లబ్ అధ్యక్షుడు డాక్టరు అమలకంటి శ్రీనివాసరావు, కార్యదర్శి బడుబు బాబీ, కోశాధికారి ఏలేటి రమేష్ పాల్గొన్నారు.


