ప్రత్యామ్నాయ పంటలు వేయాలి
టొబాకో బోర్డు ఆర్‌ఎం ప్రసాద్
సీతానగరం: వర్జీనియా పొగాకు సాగుచేస్తున్న రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని టొబాకో బోర్డు రీజనల్ మేనేజర్ జీఎల్‌కె ప్రసాద్ రైతులకు సూచించారు. బుధవారం రఘుదేవపురంలో పొగాకు పంట నియంత్రణ – ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సులో దేవరపల్లి టొబాకో బోర్డు ఆక్షన్ సూపరింటెండెంట్ పి.హేమస్మితతో కలసి పాల్గొన్నారు. అంతర్జాతీయ ఎగుమతులు అంతంత మాత్రంగా ఉన్నందున వర్జీనియా పొగాకు రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రైతులకు సూచించారు. ఏఎస్ హేమస్మిత మాట్లాడుతూ బ్లాక్ సోయల్ రైతులు లైట్ సోయల్‌కు మారడానికి తగిన భూమిలో పంట వేసి ఉండాలని, అలాగే లైట్ సోయల్‌కు తగిన భూమి అవునా కాదా అనే కమిటీ పరిశీలించిన అనంతరం లైట్ సోయల్‌కు లైసెన్సుల మార్పునకు చర్యలు తీసుకుంటామన్నారు.


