లెక్క లెక్కకో కిక్కు! | - | Sakshi
Sakshi News home page

లెక్క లెక్కకో కిక్కు!

Dec 22 2025 2:10 AM | Updated on Dec 22 2025 2:10 AM

లెక్క

లెక్క లెక్కకో కిక్కు!

రాయవరం: భవిష్యత్తుకు బాటలు వేసే గణితం మనిషి జీవితంలో ఓ అంతర్భాగం. లెక్కలు లేనిదే జీవితంలో ఏ వ్యవహారమూ గడవదు. రెండొకట్ల రెండు అనే ఎక్కాల ప్రారంభం నుంచే లెక్కలపై ఆసక్తి కలిగేలా బోధిస్తే ఏ విద్యార్థీ లెక్కలంటే భయపడరని గణిత మేధావులు సూచిస్తున్నారు. డిసెంబర్‌ 22వ తేదీ తమిళనాడుకు చెందిన గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌ జయంతిని జాతీయ గణిత శాస్త్ర దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గణిత శాస్త్ర ఫోరమ్‌లు కూడా ఆ శాస్త్రం అభివృద్ధికి కృషి చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల అభిప్రాయాలతో ప్రత్యేక కథనం.

సర్వ శాస్త్రానాం గణితం ప్రధానం

సర్వశాస్త్రానాం గణితం ప్రధానం అన్నది అక్షర సత్యం. గణిత శాస్త్రానికి పుట్టిల్లుగా భారతదేశాన్ని పేర్కొంటారు. ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడు, భాస్కరాచార్యుడు తదితర శాస్త్రవేత్తలు అనేక గణిత భావనలు ప్రవేశపెట్టారు. ‘సున్న’, ‘దశాంశమానం’, ‘రుణ సంఖ్యలు’ కనుగొన్నది భారతీయులే కావడం గమనార్హం. సమయం, డబ్బు, చేసే పని, వినోదం, విజ్ఞానం, చివరకు తినే ఆహారం ఇలా ఎన్నో ప్రక్రియలలో గణితం తన వంతు పాత్ర పోషిస్తుంది. గణితం వల్ల విద్యార్థుల్లో తార్కిక ఆలోచన పెరుగుతుంది. లెక్కలు బుర్ర పాడు చేసేవి అన్నట్టు కాకుండా పదును పెట్టేవి అనే ఆలోచనతో చదివితే జీవితంలో ఎంతో ముందుకు దూసుకుపోవచ్చని గణిత ఉపాధ్యాయులు చెప్తుంటారు. ఒక ఫార్ములా ప్రకారం మెదడు ఉపయోగించి సమాధానాలు రాస్తే గణితంలో అత్యధిక మార్కులు సాధించవచ్చని పలువురు నిరూపించారు. అందుకే గణితాన్ని క్వీన్‌ ఆఫ్‌ సైన్స్‌గా పరిగణిస్తున్నారు.

గణితాభివృద్ధికి మ్యాథ్స్‌ ఫోరం

ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థుల నైపుణ్యాలను గణితంలో మెరుగు పరచడానికి గణిత ఉపాధ్యయుల (స్కూల్‌ అసిస్టెంట్‌) సంకల్పంతో 2016 అక్టోబరు 2న రాష్ట్ర స్థాయి మ్యాథ్స్‌ ఫోరమ్‌ ప్రారంభించారు. అదే ఏడాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మ్యాథ్స్‌ ఫోరం 1,200 మంది గణిత ఉపాధ్యాయులతో ప్రారంభించిన ఈ ఫోరం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా గణిత ఉపాధ్యాయులను ఏకం చేసింది. ఈ ఫోరం సేకరించిన నిధులతో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం, మెటీరియల్‌ అందజేయడంతో పాటు విద్యార్థులకు క్విజ్‌, వీడియో కాంపిటీషన్స్‌, వక్తృత్వం, టీఎల్‌ఎం తయారీలో పాఠశాల, మండల, జిల్లా స్థాయిలో పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులకు పేపర్‌ ప్రెజెంటేషన్‌, క్విజ్‌, టీఎల్‌ఎం, మహిళా గణిత టీచర్లకు గణిత రంగవల్లుల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 15 నుంచి 22 వరకు గణిత వారోత్సవాలను నిర్వహిస్తున్నారు.

లెక్కలంటే లంకణాలు చేసినట్టు డీలా పడిపోతారు విద్యార్థులు. పదో తరగతి ఎప్పుడు దాటేస్తామా.. ఈ లెక్కల బాధలు ఎప్పుడు తప్పుతాయా అని ఎదురుచూస్తుంటారు. అదే సమయంలో కొంతమంది లెక్కలతో జిమ్మిక్కులు చేసేస్తుంటారు. స్టెప్‌ బై స్టెప్‌ చక్కగా వేసేస్తూ నూటికి నూరు మార్కులు కొట్టేస్తుంటారు. అదెలా అని ఇంకొందరు నోరెళ్లబెడుతుంటారు. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే లెక్కల చిక్కులు ఇట్టే తీసేయవచ్చని.. అసలు లెక్కలంత సులభమైన సబ్జెక్టు లేనేలేదని లెక్కల మాస్టర్లు చెప్తుంటారు. ఆ మాటకొస్తే లెక్కల చిక్కుముళ్లు తీసి సరిచేసినపుడడల్లా వచ్చే ఆ కిక్కే వేరని.. మరో లెక్కకూడా సరిచేసేయాలనే ఉత్సాహం మరింత రెట్టింపవుతుంటుందని లెక్కల వీరులు చెప్తుంటారు.

కీమో థెరపీలోనూ

హార్డీ–రామానుజన్‌ నంబర్‌

గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ చిన్న వయసులోనే గణితంపై అనేక వ్యాసాలు సూత్రీకరించారు. ఆయన కనుగొన్న సంఖ్య 1729 ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. దీని ఆధారంగానే క్యాన్సర్‌ వ్యాధికి సంబంధించిన చికిత్స కూడా సాధ్యమైనదని గణిత మేధావులు పేర్కొంటారు. కణాల పెరుగుదల ఎంత వేగంగా జరుగుతుంది, ఎలా చేస్తే ఆ విలువను తగ్గించవచ్చనే దానికి ఈ సంఖ్య ఆధారమైంది. ఇది కీమో థెరపీలోనూ కీలకమైంది.

గణిత మేధావికి ఘన నివాళి

1729 ఆకృతిలో విద్యార్థులు

రాయవరం: మండలం వి.సావరం ఎంపీయూపీ స్కూలులో రామానుజన్‌ పుట్టిన రోజును ఆదివారం ఘనంగా నిర్వహించారు. గణిత ఉపాధ్యాయుడు పి.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థులు, హెచ్‌ఎం లోవప్రసాద్‌, ఉపాధ్యాయులు పంపన వెంకటరమణ, రామలక్ష్మి రామానుజన్‌ గొప్పదనాన్ని కొనియాడారు. అనంతరం విద్యార్థులు ఇలా రామానుజన్‌ సంఖ్య 1729 ఆకృతిలో కూర్చుని ఘన నివాళులర్పించారు.

ఏమిటీ ఈ సంఖ్య ప్రత్యేకం?

రామానుజన్‌ ఆస్పత్రిలో ఉన్న సమయంలో హార్డీ 1729 నంబరు గల కారులో రాగా తన కారు నంబరు అన్‌లక్కీ అని రామానుజన్‌తో చెబుతాడు. తీవ్ర అనారోగ్యంగా ఉన్న సమయంలో కూడా రామానుజన్‌ రెండు ఘనాల మొత్తంగా, రెండు రకాలుగా రాయగలిగే అతి చిన్న సంఖ్య అని 1729 గొప్పదనాన్ని వివరించాడు. ఒకటి నుంచి 1728 వరకు ఏ సంఖ్యను రెండు ఘనాల మొత్తంగా రాయడానికి వీలులేదని రామానుజన్‌ మొట్టమొదటిగా ప్రపంచానికి తెలిపాడు. అందుకే ఈ సంఖ్య రామానుజన్‌ సంఖ్యగా ప్రఖ్యాతి పొందింది. 1729 రెండు ఘనాలుగా, రెండు క్యూబ్‌లుగా రాసిన అతి చిన్న కనిష్ఠ సంఖ్య. దీన్ని 10క్యూబ్‌+9క్యూబ్‌ = 12క్యూబ్‌+1క్యూబ్‌గా రాస్తారు.

ట్రిక్కు తెలిస్తే ఎంత పెద్ద

లెక్కకై నా ఇట్టే పరిష్కారం

గాబరా అవసరం లేని

సులువైన శాస్త్రం గణితం

ఆసక్తి కలిగేలా చెప్పడంలోనే

గురువు నేర్పరితనం

ఈ నెల 22న జాతీయ గణిత దినోత్సవం

లెక్క లెక్కకో కిక్కు! 1
1/2

లెక్క లెక్కకో కిక్కు!

లెక్క లెక్కకో కిక్కు! 2
2/2

లెక్క లెక్కకో కిక్కు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement