
గాయత్రీదేవిగా మాణిక్యాంబా అమ్మవారు
రామచంద్రపురం రూరల్: పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా, త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాల్లో 12వ శక్తి పీఠంగా విరాజిల్లుతున్న ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో దసరా మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం మాణిక్యాంబా అమ్మవారి మట్టి ప్రతిమకు గాయత్రీదేవిగా అలంకరణ చేశారు. ఆలయ ఈఓ, దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని ఆధ్వర్యంలో మేలుకొలుపు, ప్రభాత సేవ, సుప్రభాత సేవ, ప్రాతఃకాలార్చన, తీర్థపు బిందె, బాలభోగం, ప్రథమాభిషేకం, ప్రథమార్చనల అనంతరం అమ్మవారి సన్నిధిలో లక్ష కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆస్ట్రానమీలో
కై వల్యరెడ్డి ప్రతిభ
నిడదవోలు: జర్మనీలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ కాంపిటీషన్–2025లో నిడదవోలు పట్టణానికి చెందిన కుంచాల కై వల్యరెడ్డి 16–19 యూత్ కేటగిరీ ఫైనల్ రౌండ్ పూర్తి చేసుకుని, సిల్వర్ ఆనర్ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. అంతర్జాతీయ ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర సంస్థ నిర్వహించిన ఈ పోటీలో 120 దేశాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. మూడు దశల్లో నిర్వహించిన ఈ పోటీలో ఖగోళ, ఖగోళ భౌతిక శాస్త్రానికి సంబంధించిన రియల్ వరల్డ్ రీసెర్చ్ ప్రాబ్లమ్స్‌కు సంబంధించిన ప్రశ్నలుంటాయి. మొదటి రౌండ్ జూలై 4న, రెండో రౌండ్ ప్రీ ఫైనల్ ఆగస్ట్ 14న, మూడో రౌండ్ ఫైనల్ ఈ నెల 17న నిర్వహించారు. మొదటి రెండు రౌండ్లలో కటాఫ్ మార్కులు సాధించిన కై వల్యరెడ్డి ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించింది. సంస్థ నియమించిన ఇన్విజిలేటర్ ఆధ్వర్యాన ఫైనల్ రౌండ్ పరీక్షను ఈ నెల 17న ఆమె రాసింది. మూడు రౌండ్లలోనూ ప్రతిభ కనబరిచిన కై వల్యరెడ్డి సిల్వర్ ఆనర్ ప్రశంసాపత్రాన్ని అందుకుంది.
రాష్ట్రంలో కక్షపూరిత
రాజకీయాలు
సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నేతృత్వంలో కక్షపూరిత రాజకీయాలు తారస్థాయికి చేరాయని, అందుకు నిదర్శనమే ఎంపీ మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టు అని వైఎస్సార్ సీపీ మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆరోపించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న మిథున్‌రెడ్డితో నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్సీ నరేష్‌కుమార్‌రెడ్డి మంగళవారం ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు బయట వారు మీడియాతో మాట్లాడుతూ, లేని మద్యం స్కాం పేరుతో ఎంపీ మిథున్‌రెడ్డిని కూటమి ప్రభుత్వం వేధిస్తోందన్నారు. మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌తో మిథున్‌రెడ్డికి ఉన్న అనుబంధాన్ని తెంచేందుకే అక్రమ కేసులు బనాయిస్తోందని దుయ్యబట్టారు. వారి బంధాన్ని ఎవ్వరూ తెంచలేరన్నారు. గత సీఎం వైఎస్ జగన్ కంటే అభివృద్ధి, సంక్షేమాన్ని ఎక్కువ చేసి పోటీ పడాల్సింది పోయి, కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు, వేధింపులకు దిగుతోందని విమర్శించారు. ‘‘ఏపీ లిక్కర్ స్కాం ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే పెద్దదన్నారు. రూ.30 వేల కోట్లు, రూ.10 వేల కోట్లన్నారు. ఇప్పుడేమో రూ.3 వేల కోట్లని చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు’’అని దుయ్యబట్టారు. పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆదరణను జీర్ణించుకోలేని సీఎం చంద్రబాబు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఎన్ని కేసులు పెట్టినా ఎంపీ మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అన్నారు. త్వరలోనే ఆయన బయటకు వచ్చి, రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తారని అన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణుల మనోధైర్యాన్ని దెబ్బ తీసేందుకు కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ ఉభయ గోదావరి జిల్లాల కో ఆర్డినేటర్ సాదిక్ హుస్సేన్ కూడా ఉన్నారు.

గాయత్రీదేవిగా మాణిక్యాంబా అమ్మవారు

గాయత్రీదేవిగా మాణిక్యాంబా అమ్మవారు