
సైడ్‌వాల్‌ను ఢీకొన్న కారు
● దంపతులు దుర్మరణం
అన్నానగర్: కారు అదుపుతప్పి రోడ్డు సైడ్‌వాల్‌ను ఢీకొని దంపతులు దుర్మరణం చెందారు. బెంగళూరుకు చెందిన దురైరాజ్ (64). ఇతను ప్రైవేట్ పాఠశాలలో ప్రిన్సిపల్. ఇతని భార్య ఇందు (55). వీరు పుదుచ్చేరిలో ఉంటున్నారు. దంపతులు ఇద్దరు రెండు రోజుల క్రితం బెంగళూరుకు వెళ్లారు. ఆదివారం రాత్రి బెంగళూరు నుంచి పుదుచ్చేరికి కారులో బయలుదేరారు. ఆదివారం రాత్రి 8 గంటలకు కారు కృష్ణగిరి జిల్లాలోని మాథూర్ వద్ద వెళుతోంది. ఆ సమయంలో, అక్కడ భారీ వర్షం కురుస్తోంది. కన్నడహళ్లి జాతీయ రహదారిపై వెళ్తుండగా కారు అదుపుతప్పి రోడ్డు సైడ్‌వాల్‌ను ఢీకొంది. ఈప్రమాదంలో దురైరాజ్ మృతిచెందినట్లు, తీవ్రంగా గాయపడిన ఇందును హొసూర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రెఫెక్స్ మొబిలిటీగా ఈవీల్జ్
సాక్షి,చైన్నె: అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్‌లకు ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ సహకారం అందిస్తున్న రెఫెక్స్ ఈవీల్జ్‌ను రెఫెక్స్ మొబిలిటీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ వాహనాలన్నింటికి పేర్లను మారుస్తూ సోమవారం రెఫెక్స్ మొబిలిటీకి సీఈఓగా అనిరుధ్ అరుణ్‌ను సోమవారం నియమించారు. అనిరుద్ అరుణ్ మాట్లాడుతూ సురక్షిత, నమ్మకం, సామాజిక స్పృహతో కూడిన రవాణాను అందించడం లక్ష్యంగా ఈవీలతో రెఫెక్స్ సేవలను విస్తరిస్తున్నామని ప్రకటించారు.