ఏపీటీఎఫ్‌ పోరుబాట | - | Sakshi
Sakshi News home page

ఏపీటీఎఫ్‌ పోరుబాట

Mar 4 2026 8:18 AM | Updated on Mar 4 2026 8:18 AM

అమలాపురం రూరల్‌: ఉపాధ్యాయులకు ఎన్నికలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను పరిష్కరించాలని అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఏపీటీఎఫ్‌ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌ ఎదుట మంగళవారం పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మునేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎం.నాగభూషణం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, ఈ లోపుగా 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, రిటైర్‌ అయిన ఉపాధ్యాయులకు, గ్రాట్యూటీ, ఆర్జిత సెలవుల బకాయిలను వెంటనే చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు విడుదల చేయాలని కోరారు. జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్‌న్స్‌ మానిటరింగ్‌ సభ్యురాలు కొంకి రాజామణి, పీడీఎస్‌యూ జిల్లా నాయకులు రేవు తిరుపతిరావు మద్దతు తెలియజేశారు. రాష్ట్ర కార్యదర్శి జీవీవీ సత్యనారాయణ, అదనపు కార్యదర్శి జి.వెంకటటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌వీ రమణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement