బాత్‌రూమ్‌ సింక్‌లో మత్తు ఇంజక్షన్లు.. మిస్టరీగా యువతి మృతి! | Young Woman Mysterious Death In Lodge Visakhapatnam | Sakshi
Sakshi News home page

బాత్‌రూమ్‌ సింక్‌లో మత్తు ఇంజక్షన్లు.. మిస్టరీగా యువతి మృతి!

May 30 2023 3:50 PM | Updated on May 30 2023 4:24 PM

Young Woman Mysterious Death In Lodge Visakhapatnam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,విశాఖపట్నం: అనకాపల్లి జిల్లా అచ్యుతపురంలో దారుణం చోటు చేసుకుంది. లాడ్జిలో మహాలక్ష్మి అనే యువతి అనుమానాస్పద మృతి చెందడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. మహాలక్ష్మి శరీరంపై పలు చోట్ల కత్తిపోట్లు ఉండడం,  ఘటనా స్థలంలో దొరికిన ఆధారాల బట్టి ఈ మృతి పలు అనుమానాలకు తావు తీస్తోంది. వివరాల ప్రకారం.. శ్రీనివాస్‌కుమార్‌ అచ్యుతాపురంలోని ఓ లాడ్జిలో రూం తీసుకుని అక్కడికి మహాలక్ష్మిని రప్పించారు. ఈ క్రమంలో ఇద్దరూ కత్తితో కోసుకున్న గాయాలతో కనిపించేసరికి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని అనుకున్న లాడ్జి సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు.

యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం యువతి మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు. అయితే, పథకం ప్రకారమే మహాలక్ష్మిని శ్రీనివాస్‌ హత్య చేశాడని, కేసు నుంచి తప్పించుకోవడానికే ఈ డ్రామా ఆడాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో యువతి మృతి మిస్టరీగా మారింది. పోలీసులు ఈ కేసును హత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరిద్దరూ ఇంటర్ నుంచి ప్రేమించుకుని కొద్ది నెలల క్రితం వరకు రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని కారణాలతో వీరువురూ దూరంగా ఉంటున్నారు. శ్రీనివాస్‌ మహాలక్ష్మితో మాట్లాడాలని చెప్పి లాడ్జికి రప్పించాడు. ఆ తర్వాత వారి మధ్య ఏం జరిగిందో గానీ యువతి మృతి చెందగా.. శ్రీనివాస్‌ కత్తి గాయలతో ఉన్నాడు. పోలీసులు జరిపిన తనిఖీలో లాడ్జి గదిలోని బాత్రూం సింక్‌లో మత్తు ఇంజక్షన్లు ఉండగా.. వాటిని స్వాధీనం చేసుకున్నారు.

చదవండి: కర్నూలులో దారుణం.. ఇంట్లో అట్టపెట్టెలతో భర్త మృతదేహాన్ని తగలబెట్టింది!

Advertisement
 
Advertisement
Advertisement