తిరుపతిలో దారుణం.. మాస్క్‌ పెట్టుకుని ఇంట్లోకి చొరబడి.. | Unknown Person Attack On Women At Tirupati, More Details Inside | Sakshi
Sakshi News home page

తిరుపతిలో దారుణం.. మాస్క్‌ పెట్టుకుని ఇంట్లో మహిళలపై దాడి

Jul 18 2024 9:14 PM | Updated on Jul 19 2024 1:19 PM

Unknown Person Attack On Women At Tirupati

సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి ప్రభుత్వంలో దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తిరుపతిలో దారుణ హత్య జరిగింది. ముఖానికి మాస్క్‌ వేసుకుని ఓ వ్యక్తి మహిళలను హత్యచేసి పారిపోయాడు. ఈ క్రమంలో అడొచ్చిన మహిళ మనువరాలిపై దాడికి పాల్పడ్డాడు.

ఈ ఘటన తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపిన వివరాల ప్రకారం..‘తిరుపతిలోని రాయల్‌ నగర్‌లో హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించాము. జయలక్ష్మీ(67) అనే వృద్దురాలిని దుండగుడు హత్య చేశాడు. నిందితుడు ముఖానికి మాస్క్‌ వేసుకుని ఇంట్లోకి చొరబడ్డాడు. అనంతరం, ఆమెను చంపి పారిపోయే క్రమంలో మృతురాలి మనుమరాలు నియతి(14) గొంతుపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె కోడలు సురక్షపై కూడా దాడి చేశాడు.

ఇక, ఈ హత్యకు సంబంధించి కొన్ని క్లూస్‌ దొరికాయి. సీసీ కెమెరాల్లో నిందితుడి ఆచూకీలు లభించాయి. ఈ దాడి నగలను దోచుకోవడానికి దాడి జరగలేదు. త్వరలోనే ఈ కేసు మిస్టరీని చేధిస్తాము. వీలైనంత తొందరగానే నిందితుడిని పట్టుకుంటాము’ అని తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement