ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు మృతి | Sangareddy Road Accident 4 Died In A Family | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు మృతి

Oct 7 2024 7:15 PM | Updated on Oct 11 2024 8:01 AM

Sangareddy Road Accident 4 Died In A Family

సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. జ‌హీరాబాద్–బీద‌ర్ ర‌హ‌దారిపై కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు, బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు వ్య‌క్తులు మృతి చెందారు. న్యాల్కల్ మండలం హుస్సేల్లి గ్రామం వద్ద  ఈ ప్రమాదం సంభవించింది

ఈ ప్ర‌మాదంలో మరణించిన వారిని తండ్రి, కుమార్తె, అల్లుడు, మ‌నువ‌డిగా గుర్తించారు. వీరంతా పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి వ‌స్తుండ‌గా, క‌ర్ణాట‌క ఆర్టీసీ బ‌స్సు అదుపుత‌ప్పి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement