గన్నవరంలో బొలెరో బీభత్సం.. | Road Accident In Gannavaram | Sakshi
Sakshi News home page

గన్నవరంలో బొలెరో బీభత్సం

Aug 9 2021 7:37 AM | Updated on Aug 9 2021 7:58 AM

Road Accident In Gannavaram - Sakshi

గన్నవరంలో బొలెరో వాహనం బీభత్సం సృష్టించింది. హెచ్‌పీ గ్యాస్ కంపెనీ సమీపంలో జాతీయ రహదారిపై బైక్‌ను ఢీకొట్టి పాదచారులపైకి బొలెరో దూసుకెళ్లింది.

సాక్షి, కృష్ణా జిల్లా: గన్నవరంలో బొలెరో వాహనం బీభత్సం సృష్టించింది. హెచ్‌పీ గ్యాస్ కంపెనీ సమీపంలో జాతీయ రహదారిపై బైక్‌ను ఢీకొట్టి పాదచారులపైకి బొలెరో దూసుకెళ్లింది. ఈ ఘటనలో పాదచారుడు మృతి చెందాడు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రికి తరలించారు. మృతుడు దావాజిగూడెంకు చెందిన నాగయ్యగా పోలీసులు గుర్తించారు. బోలెరో వాహనం విజయవాడ నుండి ఏలూరు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
 

Advertisement
 
Advertisement
Advertisement