స్టూడెంట్‌ను ఎత్తుకెళ్లి పెళ్లికి యత్నించిన పీటీ సర్‌‌ | PT Master Kidnaps Student To Marry Her In Tamil Nadu | Sakshi
Sakshi News home page

స్టూడెంట్‌ను ఎత్తుకెళ్లి పెళ్లికి యత్నించిన పీటీ సర్‌‌

Apr 13 2021 11:34 AM | Updated on Apr 13 2021 2:41 PM

PT Master Kidnaps Student To Marry Her In Tamil Nadu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అక్కడ కూలి పనులు చేస్తూ అదే ప్రాంతంలో ఉన్న పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో పీటీ మాస్టర్‌గా పనిచేస్తున్న చరణ్‌ రాజ్‌ వివాహం చేసుకోడానికి ఆ విద్యార్థినిని కిడ్నాప్‌..

సాక్షి, తిరువొత్తియూరు: కృష్ణగిరి జిల్లా మత్తూరు సమీపంలో ప్లస్‌ వన్‌ చదువుతున్న విద్యార్థినిని కిడ్నాప్‌ చేసి వివాహం చేసుకోవడానికి ప్రయత్నించిన ప్రభుత్వ వ్యాయామోపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణగిరి జిల్లా మత్తూర్‌ సమీపం జింజెమ్‌పట్టికి చెందిన మూర్తి  కుమార్తె  (16) ప్లస్‌ వన్‌ చదువుతోంది. తిరువణ్ణామలై జిల్లా మేల్‌ సంగంలో ఉంటోంది. అక్కడ కూలి పనులు చేస్తూ అదే ప్రాంతంలో ఉన్న డేనియల్‌ మిషన్‌ మెట్రికులేషన్‌ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తోంది.

ఈ నేపథ్యంలో 9వ తేదీన ఆ విద్యార్థిని అదృశ్యమైంది. దీనిపై విద్యార్థిని తల్లి కావ్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తిరువన్నామలై నాగనూర్‌ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పీటీ మాస్టర్‌గా పనిచేస్తున్న చరణ్‌ రాజ్‌ వివాహం చేసుకోడానికి ఆ విద్యార్థినిని కిడ్నాప్‌ చేసినట్లు తేలింది. దీంతో మత్తూరు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ మురుగన్‌ ఆదివారం చరణ్‌ రాజ్‌ను అరెస్టు చేశారు. బాలికను  తల్లిదండ్రులకు అప్పగించారు.

చదవండి: అద్దె కోసం వచ్చామంటూ 12 సవర్ల బంగారం దోచేశారు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement