-
స్టూడెంట్ను ఎత్తుకెళ్లి పెళ్లికి యత్నించిన పీటీ సర్
సాక్షి, తిరువొత్తియూరు: కృష్ణగిరి జిల్లా మత్తూరు సమీపంలో ప్లస్ వన్ చదువుతున్న విద్యార్థినిని కిడ్నాప్ చేసి వివాహం చేసుకోవడానికి ప్రయత్నించిన ప్రభుత్వ వ్యాయామోపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణగిరి జిల్లా మత్తూర్ సమీపం జింజెమ్‌పట్టికి చెందిన మూర్తి కుమార్తె (16) ప్లస్ వన్ చదువుతోంది. తిరువణ్ణామలై జిల్లా మేల్ సంగంలో ఉంటోంది. అక్కడ కూలి పనులు చేస్తూ అదే ప్రాంతంలో ఉన్న డేనియల్ మిషన్ మెట్రికులేషన్ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తోంది. ఈ నేపథ్యంలో 9వ తేదీన ఆ విద్యార్థిని అదృశ్యమైంది. దీనిపై విద్యార్థిని తల్లి కావ్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తిరువన్నామలై నాగనూర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పీటీ మాస్టర్‌గా పనిచేస్తున్న చరణ్ రాజ్ వివాహం చేసుకోడానికి ఆ విద్యార్థినిని కిడ్నాప్ చేసినట్లు తేలింది. దీంతో మత్తూరు పోలీస్ ఇన్స్పెక్టర్ మురుగన్ ఆదివారం చరణ్ రాజ్‌ను అరెస్టు చేశారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. చదవండి: అద్దె కోసం వచ్చామంటూ 12 సవర్ల బంగారం దోచేశారు -
పీటీ మాస్టరుపై దాడి
* విద్యార్థి మద్దతుదారుల వీరంగం * ఉద్రిక్తత - కెమెరాలో దాడి దృశ్యాలు * ఖండించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు * ట్రాఫిక్ ఉచ్చులో కోడంబాక్కం సాక్షి, చెన్నై : తనయుడ్ని మందలించాడన్న ఆగ్రహంతో ఉపాధ్యాయుడిపై ఓ తండ్రి కన్నెర్ర జేశాడు. తన అనుచరగణాన్ని పంపించి చితకొట్టించాడు. ఆ ఉపాధ్యాయుడిపై దాడిచేసిన ఘటన సీసీ కెమెరాలో రికార్డు కావడంతో వివాదానికి దారితీసింది. పైశాచికత్వంగా దాడి జరగడాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఖండించారు. కోడంబాక్కంలో రోడ్డెక్కారు. ఆ పరిసరాలు శుక్రవారం గంటల తరబడి ట్రాఫిక్ ఉచ్చులో చిక్కాయి. ఉపాధ్యాయులు పిల్లల్ని మందలించడం సహజం. మరి కొందరు ఉపాధ్యాయులు తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించడం వివాదానికి దారి తీస్తోంది. ఇలాంటి ఉపాధ్యాయుల్ని కొట్టినా పట్టించుకునే వారు ఉండరు. అయితే, ఇందుకు భిన్నంగా ఉపాధ్యాయుడిపై దాడి జరగడం సహచర ఉపాధ్యాయుల్నే కాదు, విద్యార్థుల తల్లిదండ్రులకు కోపం తెప్పించింది. మందలింపు కోడంబాక్కం యూనెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కాలనీలో లయోలా విద్యా సంస్థ ఉంది. ఇక్కడ పీటీ మాస్టర్‌గా భాస్కర్ రాజు పనిచేస్తున్నాడు. రొనాల్డ్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థి స్కూల్ ఆవరణలో ‘ఈల’ వేస్తూ, నానా హంగామా సృష్టించినట్టు రాజు చెవిన పడింది. దీంతో రొనాల్డ్‌ను మందలించాడు. స్కూల్ నుంచి వెలుపలకు వెళ్లిన రొనాల్డ్ తన తండ్రి అరులానందంకు పీటీ మాస్టర్ మందలింపు విషయాన్ని వివరించాడు. ఆగ్రహానికి లోనైన అరులానందం తన అనుచరుల్ని వెంట వేసుకొచ్చాడు. ఎవ్వరూ లేని సమయంలో పీటీ మాస్టర్ భాస్కర్ రాజును చితకొట్టించాడు. అంతటితో ఆగకుండా కోడంబాక్కం స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా, రాజుపై అరులానందం అనుచరులు పైశాచికత్వాన్ని ప్రదర్శించడం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అరుు్యంది. రాజుకున్న వివాదం మందలించడాన్న కారణంతో ఉపాధ్యాయుడిపై విద్యార్థి తండ్రి అనుచరులు పైశాచికత్వాన్ని ప్రదర్శించ డం సహచర ఉపాధ్యాయుల్లో ఆగ్రహాన్ని రేపింది. విద్యార్థుల తల్లిదండ్రుల సంఘాలు సైతం ఆ దృశ్యాల్ని తీవ్రంగా పరిగణించాయి. అక్కడ చదువుకుంటున్న విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాలు సైతం పీటీ మాస్టర్‌కు మద్దతుగా నిలిచాయి. ఉదయాన్నే కోడంబాక్కం రోడ్డెక్కారు. ఆ పరిసరాలు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కాయి. వాహనాల్ని దారి మళ్లించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. బుజ్జగింపులు కోడంబాక్కం మార్గంలో నిరసనతో ఆ ప్రభావం వళ్లువర్‌కోట్టం, టీ నగర్, అశోక్ పిల్లర్, వడపళని పరిసరాల మీద పడింది. ఆందోళన కారుల్ని బుజ్జగించేందుకు కమిషనర్ జార్జ్ రంగంలోకి దిగారు. పెద్ద ఎత్తున బలగాలు సైతం రంగంలోకి దిగాయి. పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడం ఓ దశలో ఉద్రిక్తతకు దారి తీసింది. ఎట్టకేలకు కమిషనర్ జార్జ్ ఆందోళన కారుల్ని బుజ్జగించారు. అరులానందం అనుచరులు పది మందిని అరెస్టు చేశారు. ఆ సీసీ కెమెరా వీడియో ఫుట్టేజ్ ఆధారంగా అందర్నీ అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీ..ఎంతంటే..
మరోసారి పీఠమెక్కేదెవరో..?
విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు
వారెవ్వా... బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో నాని.. ఫ్యాన్స్ ఫిదా
ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!
హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు
అసలు ఇది చాలు! వీళ్లకు ఓటేయకుండా ఉండటానికి!
అంతా బాబే చేశారు
గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు
షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement